అధీరా ఆగయా.. భయానకంగా సంజు గెటప్‌ | KGF 2: Sanjay Dutt First Look Poster Released | Sakshi
Sakshi News home page

కేజీఎఫ్ 2: అధీరా ఆగయా..భయానకంగా సంజు గెటప్‌

Jul 29 2020 10:58 AM | Updated on Jul 29 2020 1:41 PM

KGF 2: Sanjay Dutt First Look Poster Released - Sakshi

కన్నడ చిత్రసీమతో పాటు దక్షిణాది సినీపరిశ్రమ స్థాయిని మరో మెట్టు పైకెక్కించిన చిత్రం ‘కేజీఎఫ్‌’. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడికల్‌ ఎంటర్‌టైనర్‌లో యశ్‌ కథానాయకుడిగా నటించారు. కన్నడలో రూ.200 కోట్ల మార్క్‌ను దాటిన తొలి సినిమాగా రికార్డు కూడా సొంతం చేసుకుంది. ఇప్పుడీ సినిమాకి కొనసాగింపుగా ‘కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2’ తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్‌. ఈ మూవీలో విలన్‌ అధీరా పాత్రను బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సంజయ్ దత్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా విలన్ అధీరా ఫస్ట్ లుక్‌ విడుదలైంది. బుధవారం సంజయ్ దత్ 61వ పుట్టిన రోజు కావడంతో చిత్ర యూనిట్‌ ఈ సందర్భంగా అధీరా ఫస్ట్ లుక్ విడుదల చేసింది. అధీరా ఎంత క్రూరుడో.. ఈ లుక్‌లోనే చెప్పేసింది చిత్ర‌బృందం. అత్యంత పాశవికంగా, జాలి లేని మనిషిగా అధీరా కనిపించనున్నాడు అని కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇంతకు ముందే తెలిపారు. దానికి తగ్గట్టుగానే ఫస్ట్‌ లుక్‌ కూడా అలాగే ఉంది. (సోనూసూద్‌ ఆస్తి విలువ ఎంతో తెలుసా?)


ముఖం మీద టాటూ, డిఫరెంట్ హెయిర్‌ స్టైల్‌, చేతిలో పెద్ద కత్తిలో సంజయ్‌ దత్‌ లుక్‌ భయానకంగా ఉంది.  ఈ లుక్‌ను విడుద‌ల చేసిన త‌ర్వాత ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ ‘హ్యాపీ బర్త్ డే సంజూ బాబా. మా ‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 2’లో భాగమైనందుకు ధన్యవాదాలు. తదుపరి షెడ్యూల్ కోసం ఆతృత‌గా ఎదురుచూస్తున్నాం’అన్నారు. యశ్‌ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్ ఈ సినిమాలో రవీనా టండన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. రవీ బస్రూర్‌ సంగీతమందిస్తున్న ఈ సినిమాను హొంబలే ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement