Katrina Kaif And Vicky Kaushal Get Death Threat On Social Media, Details Inside - Sakshi
Sakshi News home page

katrina Kaif-Vicky Kaushal: మరోసారి ఉలిక్కి పడ్డ బాలీవుడ్‌.. కత్రీనాను చంపేస్తామంటూ బెదిరింపులు

Jul 25 2022 3:13 PM | Updated on Jul 25 2022 3:52 PM

Katrina Kaif, Vicky Kaushal Get Death Threat On Social Media - Sakshi

గత కొంతకాలంగా బాలీవుడ్‌లో బెదింపులు కలకలం రేపుతున్నాయి. ‘భాయిజాన్‌’ సల్మాన్‌ ఖాన్‌కు లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి తరచూ హత్య బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో స్టార్‌ కపుల్‌కు హత్యా బెదిరింపులు వచ్చాయి. దీంతో బాలీవుడ్‌ మరోసారి ఉలిక్కి పడింది. ఇంతకి ఆ స్టార్‌ కపుల్‌ ఎవరంటే హీరోయిన్‌ కత్రీనా కైఫ్‌, ఆమె భర్త విక్కీ కౌశల్‌. ఇటీవల పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ జంట ప్రస్తుతం దాంపత్య జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇటీవల విక్కీ బర్తడే సందర్భంగా ఈ జంట విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇటీవలె తిరిగొచ్చిన కత్రినా,విక్కీలు తమ సినిమా షూటింగ్‌లతో బిజీ అయిపోయారు.

చదవండి: ఓటీటీకి వచ్చేస్తున్న రణ్‌బీర్‌ షంషేరా మూవీ, ఎప్పుడు.. ఎక్కడంటే

ఈ నేపథ్యంలో చంపేస్తామంటూ ఓ అగంతుడు కత్రీనాను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా బెదిరిస్తున్నాడు.దీంతో కత్రీనా-విక్కీ ముంబైలోని శాంతాక్రూజ్‌ పోలీసులను ఆశ్రయించారు. తమకు వచ్చిన బెదిరింపుల మెసేజ్‌లపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కొంతకాలంగ గుర్తు తెలియని వ్యక్తి చాలా ఇబ్బంది పెడుతున్నాడని, కత్రీనాను చంపేస్తామంటూ తరచూ బెదిరింపు మెసేజ్‌లు చేస్తున్నట్లు వి​క్కీ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇక ఈ స్టార్‌ జంట ఫిర్యాదు మేరకు పోలీసులు ఐటీ యాక్ట్‌(ఇన్‌ఫర్మెషన్‌ టెక్కాలజీ) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

చదవండి: లైగర్‌ చిత్రానికి కళ్లు చెదిరే శాటిలైట్‌, డిజిటల్‌ రైట్స్‌? ఎంతంటే..

Advertisement
 
Advertisement
Advertisement