మాల్దీవ్స్‌లో విక్ట్రీనా హనీమూన్‌.. ఫొటో షేర్‌ చేసిన నవ వధువు.. 21 గంటల్లోనే... | Katrina Kaif Shares First Pic After Wedding | Sakshi
Sakshi News home page

Katrina Kaif: మాల్దీవ్స్‌లో విక్ట్రీనా హనీమూన్‌.. ఫొటో షేర్‌ చేసిన నవ వధువు.. 21 గంటల్లోనే...

Dec 19 2021 8:58 PM | Updated on Dec 19 2021 11:39 PM

Katrina Kaif Shares First Pic After Wedding - Sakshi

‘నన్ను వదిలేసి వెళ్లావ్‌గా’ అని ఒక నెటిజన్‌ కొంటెగా కామెంట్‌ చేయగా..

పెళ్లి బంధంతో ఒక్కటైన బాలీవుడ్‌ స్టార్స్‌ విక్కీ కౌశల్‌, కత్రినా కైఫ్‌ మాల్దీవ్స్‌లో వాలిపోయారు. డిసెంబర్‌ 9న రాజస్తాన్‌లోని సవాయ్ మాధోపూర్ జిల్లా సిక్స్ సెన్సెస్ కోటలో ఏడడుగుల బంధంతో విక్ట్రీనా జంట ఒక్కటైంది. ప్రేమ ముచ్చట్ల నుంచి పెళ్లి హడావుడి వరకు వాళ్లకు సంబంధించిన వార్తలు బీటౌన్‌లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా హైలైట్‌ అయ్యాయి. 

ఇక వివాహ అనంతరం నూతన వధువు కత్రినా తొలిసారిగా ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఓ ఫొటో వైరల్‌గా మారింది. హనీమూన్‌ను మాల్దీవ్స్‌లో ప్లాన్‌ చేసుకుందీ కొత్త జంట. మెహందితో ఉన్న చేతులు, బ్యాక్‌గ్రౌండ్‌లో సముద్రతీరం ఉన్న ఫొటోను కత్రినా షేర్‌ చేసింది. లవ్లీ మాల్దీవ్స్‌, లవ్లీ లైఫ్‌ అన్నట్టుగా ఆమె షేర్‌ చేసిన ఫొటో చెప్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

కొందరు ఆలస్యంగానైనా హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌ అంటూ కామెంట్లు చేయగా.. మరికొందరు మీ రెండు చేతులు చూపిస్తూ ఫొటో ఉంది. ఫొటో విక్కీయే తీశాడు కదా? అని ఫన్నీగా స్పందించారు. ‘నన్ను వదిలేసి వెళ్లావ్‌గా’ అని ఒక నెటిజన్‌ కొంటెగా కామెంట్‌ చేశాడు. ఫొటో షేర్‌ చేసిన 21 గంటల్లోనే దాదాపు 38 లక్షలకు పైగా లైక్స్‌ రావడం విశేషం.
(చదవండి: ప్రగ్యా జైస్వాల్‌ కట్టుకున్న చీర ఖరీదెంతో తెలుసా?)

Advertisement
 
Advertisement
Advertisement