కంచర్ల సందేశం | Kancharla to release on August | Sakshi
Sakshi News home page

కంచర్ల సందేశం

Jul 23 2024 12:47 AM | Updated on Jul 23 2024 12:47 AM

 Kancharla to release on August

‘ఉపేంద్రగాడి అడ్డా’ ఫేమ్‌ కంచర్ల ఉపేంద్ర బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘కంచర్ల’. యాద్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షీ జైస్వాల్‌ హీరోయిన్‌. సుమన్, అజయ్‌ ఘోష్‌ ఇతర పాత్రలు చేశారు. ఎస్‌ఎస్‌ఎల్‌వీ క్రియేషన్స్ పై కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్నారు. అరకులో చిత్రీకరించిన తాజా షెడ్యూల్‌తో ఈ మూవీ చిత్రీకరణ పూర్తయింది.

ఈ సందర్భంగా కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ–‘‘మా ఇంటి పేరైన ‘కంచర్ల’ టైటిల్‌తో సినిమా నిర్మించడం సంతోషంగా ఉంది. ఆగస్టు 15 తర్వాత సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘మంచి కథాంశంతో తీసిన మా చిత్రం గొప్ప విజయం అందుకుంటుంది’’ అన్నారు కంచర్ల ఉపేంద్ర బాబు. ‘‘కంచర్ల’ సినిమాలో మంచి సందేశం ఉంటుంది’’ అన్నారు యాద్‌ కుమార్‌. ‘‘మా మూవీ అన్ని వర్గాల ప్రేక్షుకులని ఆకట్టుకుంటుంటుంది’’ అన్నారు మీనాక్షీ జైస్వాల్‌.

Advertisement
 
Advertisement
Advertisement