రాకింగ్‌ రాకేశ్‌కు పెద్ద షాకే ఇచ్చింది! | Jordar Sujatha Fools Rocking Rakesh | Sakshi
Sakshi News home page

Jordar Sujatha: భర్తకు పెద్ద షాక్‌ ఇచ్చిన జోర్దార్‌ సుజాత.. దెబ్బకు ముఖం మాడిపోయింది!

Feb 14 2024 4:57 PM | Updated on Feb 14 2024 9:40 PM

Jordar Sujatha Fools Rocking Rakesh - Sakshi

ఇది నేనే కొన్నాను, నీ పేరు మీదే రిజిస్ట్రేషన్‌ చేయించాను' అంటూ రాకేశ్‌ను సర్‌ప్రైజ్‌ చేసింది. భార్య ఇల్లు కొన్న విషయం తెలిసి షాకయ్యాడు రాకేశ్‌.

తెలంగాణ యాసతో గలగలా మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకుంది జోర్దార్‌ సుజాత. వసపిట్టలా మాట్లాడే ఈమె మొదట్లో యాంకర్‌గా చేసినా తర్వాత కమెడియన్‌గా, నటిగానూ సత్తా చాటింది. బిగ్‌బాస్‌ షోతో ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఆమె గతేడాది జబర్దస్త్‌ కమెడియన్‌ రాకింగ్‌ రాకేశ్‌ను పెళ్లాడింది. అప్పటినుంచి తన జీవితంలో సంతోషకర క్షణాలను, బాధను, ఏ విషయాన్నైనా సరే యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా అభిమానులతో పంచుకుంటూ వస్తోంది.

ఈ మధ్యే వాస్తు బాలేదని తన ఇల్లు ఖాళీ చేసింది. ఈ క్రమంలో సర్‌ప్రైజ్‌ అంటూ యూట్యూబ్‌లో వీడియో రిలీజ్‌ చేసింది. కొత్త ఇల్లు కొన్నట్లు తెలిపింది. భర్తకు తెలియకుండానే ఈ 3BHKను కొనుగోలు చేసినట్లు తెలిపింది. 17వ అంతస్తులో ఓ ఫ్లాట్‌ కొన్నానంటూ దాన్ని చూపించింది. 'ఇది నేనే కొన్నాను, నీ పేరు మీదే రిజిస్ట్రేషన్‌ చేయించాను' అంటూ రాకేశ్‌ను సర్‌ప్రైజ్‌ చేసింది. భార్య ఇల్లు కొన్న విషయం తెలిసి షాకయ్యాడు రాకేశ్‌.

నువ్వు ఇంత గొప్ప స్థాయికి ఎదిగినందుకు సంతోషంగా ఉందంటూ మెచ్చుకున్నాడు. కానీ ఇంతలోనే అసలు విషయం బయటపెట్టింది సుజాత. ఈ ఇల్లు తాను కొనలేదని చెప్పింది. పక్కింటివాళ్లు కొన్నారంటూ ప్రాంక్‌ చేసింది. ఈ రేంజ్‌ ట్విస్ట్‌ ఊహించని రాకేశ్‌కు నోట మాట రాలేదు. ఇలాంటి ప్రాంకులు చేయకని సుతిమెత్తగా వారించాడు. కెమెరా ఆన్‌లో ఉంది కాబట్టి ఏం చేయడం లేదని అసహనానికి లోనయ్యాడు. తనకు ఆల్‌రెడీ ఇల్లు ఉందని, అయినా సరే ఇలాంటి ఇల్లు కూడా ఎప్పటికైనా కొంటామని చెప్పుకొచ్చారు.

చదవండి:  నా లైఫ్‌లోకి భార్య వచ్చాకే అదంతా మారింది.. అంతకుముందు..

Advertisement
 
Advertisement
Advertisement