బ్యాచిలర్‌ కష్టాలు | Jatheeyam song lyrical video from Bakasura Restaurant gets released | Sakshi
Sakshi News home page

బ్యాచిలర్‌ కష్టాలు

Jun 1 2025 2:44 AM | Updated on Jun 1 2025 9:11 AM

Jatheeyam song lyrical video from Bakasura Restaurant gets released

నటుడిగా, హాస్యనటుడిగా ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న ప్రవీణ్‌ హీరోగా నటించిన మొదటి చిత్రం ‘బకాసుర రెస్టారెంట్‌’. ఎస్‌జే శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్‌ రోల్‌లో నటించారు. ఎస్‌జే మూవీస్‌పై లక్ష్మయ్య ఆచారి, జనార్ధన్‌ ఆచారి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.

వికాస బడిస సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘నా అంగీ జాతీయం... నీ లుంగీ జాతీయం...’ అంటూ సాగే లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్‌జే శివ మాట్లాడుతూ– ‘‘హంగర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో ఎన్నో థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ఉన్నాయి. బ్యాచిలర్‌ కష్టాలు, బ్యాచిలర్‌ లైఫ్‌లో ఉండే ఆనందాలను తెలియజేస్తూ విష్ణువర్థన్‌ రాసిన ‘నా అంగీ జాతీయం..’పాటని అనురాగ్‌ కులకర్ణిపాడారు’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.  
 

Advertisement
 
Advertisement
Advertisement