మా లైన్‌ దాటలేదు: ‘దిల్‌’ రాజు | il Raju About Suhas Janaka Aithe Ganaka movie | Sakshi
Sakshi News home page

మా లైన్‌ దాటలేదు: ‘దిల్‌’ రాజు

Sep 3 2024 1:00 AM | Updated on Sep 3 2024 1:00 AM

il Raju About Suhas Janaka Aithe Ganaka movie

‘‘దిల్‌’ రాజు ప్రోడక్షన్‌ అంటే కుటుంబంతో కలిసి చూసే సినిమా ఉంటుంది. అయితే ‘జనక అయితే గనక’ కాస్త భిన్నంగా ఉంటుంది. కానీ మా బేనర్‌ లైన్‌ దాటకుండా తీశాం’’ అన్నారు ‘దిల్‌’ రాజు. సుహాస్, సంగీర్తన హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘జనక అయితే గనక’. దిల్‌ రాజు ప్రోడక్షన్స్‌ బ్యానర్‌పై శిరీష్‌ సమర్పణలో హర్షిత్‌ రెడ్డి, హన్షిత ఈ సినిమాను నిర్మించారు. సందీర్‌ రెడ్డి బండ్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది.

ఈ సందర్భంగా సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ – ‘‘చేస్తున్న ప్రతి సినిమాకీ ఒక్కో మెట్టు ఎక్కుతున్న సుహాస్‌ కొత్త కథలు ఎంచుకుంటున్నాడు. సుహాస్‌ అంటే మినిమమ్‌ గ్యారెంటీ అని యూఎస్‌ డిస్ట్రిబ్యూటర్లు కూడా అంటున్నారు. ఇక చిన్న సినిమాలకు ప్రీమియర్లు కలిసి వస్తున్నాయి. మేం సెప్టెంబర్‌ 6న ప్రీమియర్లు వేస్తున్నాం.

ఈ సినిమా చూశాక వినోదంతో పాటు మంచి సందేశం ఇచ్చారనే ఫీల్‌తో థియేటర్‌ నుంచి బయటకు వస్తారు’’ అని అన్నారు. ‘‘ప్రశాంత్‌ నీల్‌కి ఈ కథ తెలుసు... చాలా బాగుందన్నారు’’ అని  సందీప్‌ రెడ్డి చెప్పారు. ‘‘ఈ సినిమాని ఓవర్సీస్‌లో డిస్ట్రిబ్యూట్‌ చేయాలనుకుంటున్నానని ‘దిల్‌’ రాజుగారితో చెబితే ఓకే అన్నారు’’ అని సుహాస్‌ తెలిపారు. ఎడిటర్‌ కోదాటి, సంగీతదర్శకుడు విజయ్‌ బుల్గానిన్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement