క్యాన్సర్‌ను జయించిన యోధుడు: హృతిక్‌ | Hrithik Roshan Praises His Father On Her Birthday | Sakshi
Sakshi News home page

క్యాన్సర్‌ను జయించిన యోధుడు: హృతిక్‌

Sep 6 2020 6:16 PM | Updated on Sep 6 2020 6:44 PM

Hrithik Roshan Praises His Father On Her Birthday  - Sakshi

ముంబై: బాలీవుడ్‌ గ్రీక్‌గాడ్‌ హృతిక్‌ రోషన్‌ తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా సోషల్‌ మీడియాలో భావోద్వేగంగా పోస్ట్‌ చేశారు. రాకేష్‌ రోషన్‌ 71వ పుట్టిన రోజు సందర్భంగా హృతిక్‌ స్పందిస్తూ తన తండ్రి జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కొన్నాడని, కెరీర్‌ ప్రారంభంలో పరిమితమైన విజయాలే లభించాయని తెలిపారు. ఆ తర్వాత భయానక క్యాన్సర్‌ (గొంతు) వ్యాధితో బాధపడ్డాడని, అయినా ఎక్కడా ధైర్యాన్ని కోల్పోకుండా క్యాన్సర్‌ను జయించాడని తెలిపాడు. తన తండ్రి పోరాట యోధుడని కీర్తించాడు. 

అయితే గతంలో ఓ టివీ చానెల్‌లో రాకేష​ రోషన్‌ స్పందిసు కెరీర్‌ పరంగా 2017 సంవత్సరంలో తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నానని అన్నారు. నటుడిగా అంత గుర్తింపు రాకున్నా సినిమా నిర్మాణ రంగం, దర్శకత్వ విభాగాలపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. కాగా తన కలలను కొడుకు హృతిక్‌ రోషన్‌ నెరవేర్చాడని చాలా సందర్భంలో రాకేష్‌ తెలిపారు. అయితే 2006 సంవత్సరంలో తన కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొందని కనీసం ఇంటి అద్దె కట్టడానికి డబ్బులు లేవని హృతిక్‌ గుర్తు చేసుకున్నాడు. (చదవండి: అల్లు అర్జున్‌, విజయ్‌ సీక్రెట్‌ తెలుసుకోవాలి: హృతిక్)‌

Advertisement
 
Advertisement
Advertisement