Hero Vishal Reacts On Mark Antony Movie Set Accident, Video Viral | Vishal Mark Antony Movie Set Accident - Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left_article_page

<!-- article right pillar ad-->
<div class="skyscraper_ad right" id="div-gpt-ad-1713538770134-0">
   <div class="inner_skyscraper">
       <script>
                                if (!window.mobileCheck()) {   googletag.cmd.push(function() { googletag.display('div-gpt-ad-1713538770134-0'); }); }
                                   </script>
   </div>
</div>

Vishal: కొన్ని అంగుళాల దూరంలో నా చావు కనిపించింది: విశాల్‌

Feb 22 2023 7:14 PM | Updated on Feb 22 2023 8:09 PM

Hero Vishal Reacts On Mark Antony Movie Set Accident, Video Viral - Sakshi

'కొద్ది క్షణాలు.. కొన్ని అంగుళాల దూరంలో నా చావు కనిపించింది. థ్యాంక్‌ గాడ్‌.. ఈ ప్రమాదం

కోలీవుడ్‌ హీరో విశాల్‌ యాక్షన్‌ సీన్లలో డూప్‌ లేకుండా నటిస్తూ ఎన్నోసార్లు గాయపడ్డాడు. తాజాగా ఆయన 'మార్క్‌ ఆంటోని' సినిమా షూటింగ్‌లో ఓ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అదుపుతప్పి వేగంగా వస్తున్న ట్రక్కు.. కింద పడి ఉన్న విశాల్‌ పక్క నుంచే వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోను చిత్రయూనిట్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. సాంకేతిక ఇబ్బందుల వల్ల ఈ ప్రమాదం సంభవించిందని, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడించింది.

అటు విశాల్‌ కూడా ఈ వీడియో షేర్‌ చేస్తూ.. 'కొద్ది క్షణాలు.. కొన్ని అంగుళాల దూరంలో నా చావు కనిపించింది. థ్యాంక్‌ గాడ్‌.. ఈ ప్రమాదం తర్వాత తిరిగి షూటింగ్‌లో పాల్గొన్నాం' అని ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నటుడు దీపక్‌ పరమేశ్‌ దీనిపై స్పందిస్తూ.. 'చూడటానికే భయంకరంగా ఉంది. నీకేం కాలేదు, అంతే చాలు. మిగతా అందరూ కూడా క్షేమంగానే ఉన్నారని భావిస్తున్నాను' అని రాసుకొచ్చాడు. అభిమానులు సైతం 'షాట్‌ కోసం నిర్లక్ష్యంగా ఉండకండి, నిన్ను నమ్ముకుని చాలామందిమి ఉన్నాం, నువ్వు మాకెంతో అవసరం' అని కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: గతేడాదే నా పెళ్లైపోయింది: రకుల్‌

Advertisement
 
Advertisement
Advertisement