మరో ఓటీటీలోకి స్టార్‌ హీరోయిన్‌ హారర్‌ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Hansika Latest Movie Coming To another OTT From This Date | Sakshi
Sakshi News home page

article header script

105 Minutes: ఆరు రోజుల్లో పూర్తయిన హారర్ సినిమా. మరో ఓటీటీలో స్ట్రీమింగ్!

Published Thu, Jun 6 2024 3:39 PM | Last Updated on Thu, Jun 6 2024 3:47 PM

Hansika Latest Movie Coming To another OTT From This Date

స్టార్‌ హీరోయిన్ హన్సిక నటించిన హారర్ సస్పెన్స్ థ్రిల్లర్‌ 105 మినిట్స్‌. ఓకే ఒక్క పాత్రతో సింగిల్‌ షాట్‌లో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమాను కేవలం ఆరు రోజుల్లోనే పూర్తి చేశారు. హన్సిక ప్రధాన పాత్రలో నటించిన ఈ ప్రయోగాత్మక సినిమాని రాజు దుస్సా దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ హారర్‌ థ్రిల్లర్‌ జనవరిలో బాక్సాఫీస్ వద్ద సందడి చేయగా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో సందడి చేస్తోన్న సంగతి తెలిసిందే. అమెజాన్ ప్రైమ్‌లో రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ చిత్రం మరో ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈనెల 7 నుంచి ఆహాలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని ఆహా ట్విటర్ వేదికగా వెల్లడించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement