‘గుణసుందరి కథ’కు ఆడవాళ్లు కనెక్ట్‌ అవుతారు: ఓం ప్రకాశ్‌ మార్త | 'Gunasundari Katha' Movie To Release On 13th October | Sakshi
Sakshi News home page

‘గుణసుందరి కథ’కు ఆడవాళ్లు కనెక్ట్‌ అవుతారు: ఓం ప్రకాశ్‌ మార్త

Oct 12 2023 3:02 PM | Updated on Oct 12 2023 3:12 PM

Gunasundari Katha Movie To Release On 13th October - Sakshi

నేటి సమాజంలో స్త్రీ ఎదురుకుంటున్న సమస్యల నేపథ్యంలో ‘గుణ సుందరి కథ’ సినిమాను తెరకెక్కించామని అన్నారు చిత్ర దర్శకుడు ఓం ప్రకాశ్‌ మార్త. సునీత సద్గురు, కార్తీక్ సాహస్, రేవంత్, ఆనంద చక్రపాణి, అశోక్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్‌ 13న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శక నిర్మాత ఓం ప్రకాశ్‌ మాట్లాడుతూ.. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ముందుగా సెన్సార్ వారు అభినందించడం మా మొదటి విజయంగా భావిస్తున్నాం అన్నారు.

అలాగే ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ లో నిలదోక్కుకుంటున్న నటినటులతో  చేసిన ఈ ప్రయత్నం అందరికి మంచి పేరు.. గుర్తింపు తెస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేసారు. సీరియస్ కంటెంట్ తో వస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ముఖ్యంగా ఆడవాళ్లకు బాగా కనెక్ట్ అవుతుందని నమ్మకంతో ఉన్నామన్నారు. అక్టోబర్ 13 న రిలీజ్ కాబోతున్న గుణ సుందరి కథ చిత్రాన్ని అందరూ ఆదరించాలని, అలాగే కంటెంట్ ని నమ్ముకుని చేసే మాలాంటి చిన్న చిత్రాలను కూడా అందరూ సపోర్ట్ చేయాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement