
థియేటర్లలో అంటే సెన్సార్ ఇబ్బందులు ఉంటాయి. కానీ ఓటీటీలో మాత్రం ఇబ్బందులు ఉండవు. దీంతో బోల్డ్, రియలస్టిక్ పేరిట బూతులు, రొమాన్స్ కాస్త గట్టిగానే చూపించేస్తుంటారు. అలా ఇప్పుడు ఓ రొమాంటిక్ కామెడీ సిరీస్ తెలుగులో స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. డేట్ ప్రకటించడంతో పాటు టీజర్ రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'తండేల్'.. ప్లాన్ మారిందా?)
ఆహా ఓటీటీలో 2022లో తమిళంలో రిలీజైన వెబ్ సిరీస్ 'ఎమోజీ'. మహత్ రాఘవేంద్ర, మానస చౌదరి, దేవిక ప్రధాన పాత్రలు పోషించారు. తమిళంలో హిట్ అయిన ఈ సిరీస్ ని ఇప్పుడు తెలుగులో ఫిబ్రవరి 28 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు.
లవ్ చేసుకున్న ఓ యువతీయువకుడు అనుకోని విధంగా విడిపోతారు. ఆ కుర్రాడి జీవితంలోకి మరో అమ్మాయి వస్తుంది. కొన్నిరోజులకు మాజీ లవర్ మళ్లీ ఇతడి జీవితంలోకి వస్తుంది. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ. టీజర్ చూస్తే మాత్రం బోల్డ్ డైలాగ్స్, రొమాంటిక్ సీన్స్ కూడా కనిపించాయి.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?)
Love, passion, and destiny. Will they find their way back? #Emoji Premiering February 28th, only on Aha
#EmojionAha @Maanasa_chou @Devu_devika77 @Mahatofficial pic.twitter.com/XTqPqfAOPU— ahavideoin (@ahavideoIN) February 25, 2025