డబుల్‌ ఇస్మార్ట్‌ సెన్సార్‌ రివ్యూ.. హైలెట్స్‌ ఇవే | Double Ismart Movie Censor Reports | Sakshi
Sakshi News home page

డబుల్‌ ఇస్మార్ట్‌ సెన్సార్‌ రివ్యూ.. క్లైమాక్స్‌ ట్విస్ట్‌ మైండ్‌ బ్లోయింగ్‌?

Aug 8 2024 4:04 PM | Updated on Aug 8 2024 4:44 PM

Double Ismart Movie Censor Reports

డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ , ఉస్తాద్‌ రామ్‌ పోతినేని కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’.  బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్ర పోషించాడు. రామ్ పోతినేనికి జోడీగా కావ్య థాపర్ నటించింది.పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ గ్రాండ్ గా నిర్మించిన ఈ మూవీ  ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్‌, ట్రైలర్‌కి మంచి స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా సెన్సార్‌ ఫార్మాలిటీస్‌ని కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్‌ సభ్యులు ఈ చిత్రానికి ఏ సర్టిఫికేట్‌ జారీ చేశారు.

ఇద్దరికి కంబ్యాక్‌ ఫిల్మ్‌!
డబుల్‌ ఇస్మార్ట్‌ హిట్‌ డైరెక్టర్‌ పూరి, హీరో రామ్‌కి చాలా అవసరం. ఇద్దరి ఖాతాలో హిట్‌ లేదు. అందుకే చాలా జాగ్రత్తగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇస్మార్ట్‌ శంకర్‌ మాదిరే డబుల్‌ ఇస్మార్ట్‌ కూడా భారీ బ్లాక్‌ బస్టర్‌ అవుతుందని మేకర్స్‌ ముందు నుంచి చెబుతున్నారు.తాజాగా సెన్సార్‌ సభ్యులు కూడా ఆ విషయాన్నే చెప్పినట్లు తెలుస్తోంది. సినిమా చూసి.. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ అని ప్రశంసించారట. 

సంజయ్ దత్, రామ్ పోతినేని మధ్య మైండ్ గేమ్ తో సాగే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని అంటున్నారు. హీరో హీరోయిన్ల లవ్‌ట్రాక్‌ కూడా అదిరిపోయిందట. ఇక క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ మైండ్‌ బ్లాక్‌ చేస్తుందని అంటున్నారు. అలీ కామెడీ, మణి శర్మ మ్యూజిక్‌ సినిమాకు ప్లస్‌ పాయింట్స్‌ అని చెప్పారట. సెన్సార్‌ సభ్యుల టాక్‌ బట్టి చూస్తే.. రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ ఇద్దరికీ కంబ్యాక్‌ ఫిల్మ్‌గా అవ్వబోతుందని తెలుస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement