డబుల్‌ ఇస్మార్ట్‌ని ఎంజాయ్‌ చేస్తారు: సంజయ్‌ దత్‌ | Double iSmart Big Bull Song Launch: Sanju | Sakshi
Sakshi News home page

డబుల్‌ ఇస్మార్ట్‌ని ఎంజాయ్‌ చేస్తారు: సంజయ్‌ దత్‌

Aug 9 2024 12:30 AM | Updated on Aug 9 2024 12:30 AM

Double iSmart Big Bull Song Launch: Sanju

‘‘తెలుగు సినిమా డైనమిక్స్‌ని మార్చిన డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ సార్‌. ‘డబుల్‌ ఇస్మార్ట్‌’లో నన్ను భాగం చేసి, బిగ్‌ బుల్‌గా చూపిస్తున్న ఆయనకి థ్యాంక్స్‌. రామ్‌తో పని చేయడంతో చాలా మజా వచ్చింది. ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ని ఆడియన్స్‌ బాగా ఎంజాయ్‌ చేస్తారు’’ అని బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ అన్నారు. రామ్‌ పోతినేని, కావ్యా థాపర్‌ జంటగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ నెల 15న ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ విడుదల చేస్తోంది.

మణిశర్మ సంగీతం అందించిన ఈ మూవీలోని ‘బిగ్‌ బుల్‌...’ అంటూ సాగే పాటని ముంబైలో జరిగిన ఈవెంట్‌లో విడుదల చేశారు. భాస్కరభట్ల రవికుమార్‌ సాహిత్యం అందించిన ఈ పాటని పృధ్వీ చం, సంజన కల్మంజే పాడారు. ఈ సందర్భంగా రామ్‌ మాట్లాడుతూ– ‘‘డబుల్‌ ఇస్మార్ట్‌’తో ఉత్తరాది ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉంది. సంజయ్‌ దత్‌గారితో పని చేయడం గౌరవంగా ఉంది’’ అని పేర్కొన్నారు. ‘‘సంజయ్‌ బాబాకి నేను బిగ్‌ ఫ్యాన్‌ని. ఆయన ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ చేయడం చాలా హ్యాపీగా ఉంది’’ అని పూరి జగన్నాథ్‌ చె΄్పారు. ఈ వేడుకలో ఛార్మీ, కావ్యా థాపర్, పూరి కనెక్ట్స్‌ సీఈవో విష్, నటుడు అలీ మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement