అట్నే ఉండు | Dhanush Kuberaa Movie Poyiraa Mama Song Released | Sakshi
Sakshi News home page

అట్నే ఉండు

Apr 21 2025 12:07 AM | Updated on Apr 21 2025 12:07 AM

Dhanush Kuberaa Movie Poyiraa Mama Song Released

‘ఏ... వన్‌ డే హీరో నువ్వే ఫ్రెండు... నీ కోసమే డప్పుల్‌ సౌండు... అస్సల్‌ తగ్గక్‌... అట్నే ఉండు... మొక్కూతారు కాళ్లూ రెండు...’ అంటూ ఊర మాస్‌ పాట పాడారు హీరో ధనుష్‌.  శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మికా మందన్నా ముఖ్య తారలుగా సునీల్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు నిర్మిస్తున్న ‘కుబేర’ చిత్రంలో ‘పోయిరా మామా...’ అంటూ సాగే ఈ పాటను విడుదల చేశారు.

దేవిశ్రీ ప్రసాద్‌ స్వరపరచిన ఈ పాటకి భాస్కరభట్ల సాహిత్యం అందించగా ధనుష్‌ పాడారు. శేఖర్‌ వీజే నృత్య రీతులు సమకూర్చారు. తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం జూన్‌ 20న హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement