మిస్టర్‌ కల్యాణ్‌ ట్రైలర్‌ను విడుదల చేసిన ధమాకా డైరెక్టర్‌

Dhamaka Director Released Mr Kalyan Movie Trailer - Sakshi

ఉషశ్రీ సమర్పణలో శ్రీ దత్తాత్రేయ క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న సినిమా మిస్టర్‌ కల్యాణ్‌.ఫ్యామిలీ, లవ్‌ అండ్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో మాన్యం కృష్ణ, అర్చన, హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంతో పండు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సప్తగిరి, ధనరాజ్, తాగుబోతు రమేష్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా షూటింగ్‌  ఇటీవలె పూర్తయ్యింది.

ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్‌ను ధమాకా మూవీ డైరెక్టర్‌ నక్కిన త్రినాథరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి ఆయన బెస్ట్‌ విషెస్‌ తెలియజేశారు. మిస్టర్ కళ్యాణ్ ట్రైలర్ బాగుందని, మేకింగ్, లొకేషన్స్, డైలాగ్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయని పేర్కొన్నారు. 
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top