ఓటీటీలోకి తెలుగమ్మాయి తీసిన లేటెస్ట్ సినిమా | Dear Uma Movie OTT Streaming Details | Sakshi
Sakshi News home page

Dear Uma OTT: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి తెలుగు మూవీ

Jun 11 2025 12:26 PM | Updated on Jun 11 2025 12:30 PM

Dear Uma Movie OTT Streaming Details

తెలుగమ్మాయి సుమయ రెడ్డి హీరోయిన్‌గా చేస్తూ ఓ సినిమా నిర్మించింది. కథ కూడా ఈమెని సమకూర్చడం విశేషం. తొలి చిత్రంతోనే ఇలా ఇన్ని విభాగాలకు పనిచేసిన సుమయ.. మంచి ప్రయత్నం చేసిందనే ప్రశంసలు కూడా అందుకుంది. ఏప్రిల్‌లో ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కాగా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో స్ట్రీమింగ్ కాబోతుంది?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్)

సుమయ రెడ్డి స్టోరీ అందించి హీరోయిన్-నిర్మాతగా చేసిన సినిమా 'డియర్ ఉమ'. కన్నడ నటుడు పృథ్వీ అంబర్ హీరోగా నటించాడు. రొమాంటిక్ థ్రిల్లర్‌గా మెడికల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఏప్రిల్ 17న రిలీజై మంచి ప్రయత్నం చేశారనే ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ మూవీ.. సన్ నెక్స్ట్ ఓటీటీలో జూన్ 13 నుంచి అంటే ఈ శుక్రవారమే స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతానికైతే తెలుగులో మాత్రం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.

'డియర్ ఉమ' విషయానికొస్తే.. పల్లెటూరిలో పుట్టి పెరిగిన ఉమ (సుమయ రెడ్డి) కష్టపడి ఎంబీబీఎస్ సీటు సాధిస్తుంది. హాస్పిటల్ కట్టి తన తండ్రి కల నెరవేర్చాలని అనుకుంటుంది. మరోవైపు దేవ్(పృథ్వీ అంబర్)కి మ్యూజిక్ అంటే ప్రాణం. కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. మ్యూజిక్ కారణంగానే ఆమె ఇతడికి బ్రేకప్ చెప్పి వెళ్లిపోతుంది. ఓ డైరీ ద్వారా ఉమ, దేవ్ జీవితంలోకి వ‌స్తుంది. అలా డైరీ చదువుతూ ఉమతో ప్రేమలో పడతాడు. ఆమెకు లవ్ ప్రపోజ్ చేయాలనుకుంటున్న టైంలో షాకింగ్ నిజం ఒక‌టి తెలుస్తుంది. ఇంతకీ అదేంటి? కార్పొరేట్ మెడిక‌ల్ మాఫియాపై సాగించిన పోరాటంలో ఉమ‌కు ఏమైంది? అనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి సంతానం కామెడీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

Advertisement
 
Advertisement
Advertisement