ఆమెను నా భర్త పెళ్లి చేసుకోలేదు.. పోలీసులకు హీరో భార్య లేఖ! | Vijayalakshmi Says Pavithra Gowda Is Not Darshan's Wife | Sakshi
Sakshi News home page

ఆమెను నా భర్త పెళ్లి చేసుకోలేదు.. పోలీసులకు హీరో భార్య లేఖ!

Jul 4 2024 4:44 PM | Updated on Jul 4 2024 5:22 PM

Vijayalakshmi Says Pavithra Gowda Is Not Darshan's Wife

రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్‌తో పాటు నటి పవిత్రా గౌడను పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరు పోలీసు కస్టడీలో ఉన్నారు. అయితే ఈ కేసు విచారణలో వీరిద్దరిని దంపతులుగా పేర్కొనడంపై దర్శన్‌ భార్య విజయలక్ష్మి అభ్యంతరం తెలిపింది. పవిత్రాగౌడ, దర్శన్‌ భార్య కాదంటూ బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌కు లేఖ రాసింది. 

‘ఇటీవల మీరు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవిత్రను దర్శన్‌ భార్య అని తప్పడు ప్రకటన చేశారు. ఆ తర్వాత హోంమంత్రి కూడా అలానే పేర్కొన్నారు. ఆమెను నా భర్త పెళ్లి చేసుకోలేదు. దర్శన్‌కు పవిత్ర కేవలం స్నేహితురాలు మాత్రమే. దర్శన్‌కు చట్టపరమైన జీవిత భాగస్వామిని నేనే. మా పెళ్లి 2003లో జరిగింది. దయచేసి పోలీసు రికార్డుల్లో పవిత్రాగౌడను దర్శన్‌ భార్య అని పేర్కొనకండి. ఇది భవిష్యత్తులో నాకు, నా కుమారుడికి సమస్యలు తెచ్చిపెడుతుంది.  పవిత్రకు సంజయ్‌సింగ్‌ అనే వ్యక్తితో వివాహమైంది. వారికి ఓ కుమార్తె కూడా ఉంది. దయచేసి ఈ వాస్తవాలను రికార్డుల్లో స్పష్టంగా రాయండి’ అని విజయలక్ష్మి విజ్ఞప్తి చేసింది.

కాగా, దర్శన్‌కి విజయలక్ష్మితో వివాహమైనప్పటికీ.. కొంతకాలంగా దూరంగా ఉంటున్నాడు. కన్నడ నటి పవిత్రాగౌడతో సహజీవనం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయం దర్శన్‌ అభిమాని రేణుకాస్వామికి తెలియడంతో.. విజయలక్ష్మికి అన్యాయం జరుగుతుందని భావించి.. పవిత్రకు అశ్లీల సందేశాలు పంపించి హెచ్చరించాడు. అదే అతని హత్యకు దారి తీసిందని పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. 

Advertisement
 
Advertisement
Advertisement