Comedian Betha Sudhakar Death Rumours Goes Viral, Know Truth Inside - Sakshi
Sakshi News home page

Betha Sudhakar: కమెడియన్‌ సుధాకర్‌ మృతి అంటూ నెట్టింట ఫేక్‌ పోస్టులు..

May 22 2023 5:39 PM | Updated on May 22 2023 6:38 PM

Comedian Betha Sudhakar Death Rumours Goes Viral, Know Truth Inside - Sakshi

ఏకంగా ఆయన చనిపోయాడంటూ నివాళులు అర్పిస్తున్నారు. కొన్ని వెబ్‌సైట్లు, యూట్యూబ్‌ ఛానళ్లు సైతం ఆయన మరణించారని ప్రచారం చేస్తున్నారు. కానీ ఇందులో ఏమాత్రం

ప్రముఖ హాస్యనటుడు బేతా సుధాకర్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటూ ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. కొందరైతే ఏకంగా ఆయన చనిపోయాడంటూ నివాళులు అర్పిస్తున్నారు. కొన్ని వెబ్‌సైట్లు, యూట్యూబ్‌ ఛానళ్లు సైతం ఆయన మరణించారని ప్రచారం చేస్తున్నారు. కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు.

దీంతో సుధాకర్‌పై తప్పుడు వార్తలను ప్రచారం చేసినవారిపై మండిపడుతున్నారు అభిమానులు. 'ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని చంపేస్తున్నారు, కాస్తైనా సిగ్గనిపించడం లేదా?' అని ఫైర్‌ అవుతున్నారు. కాగా 1959 మే 18న జన్మించిన సుధాకర్‌ సినిమాలపై ఆసక్తితో మద్రాస్‌ వెళ్లాడు. అక్కడ చిరంజీవి, నారాయణరావు, హరిప్రసాద్‌లతో కలిసి ఒకే గదిలో ఉండేవారు. ఛాన్సుల కోసం వెతుకుతున్న సమయంలో దర్శకుడు భారతీరాజాతో ఆయనకు పరిచయమేర్పడింది.

అలా భారతీరాజా డైరెక్షన్‌లో కిళుక్కెమ్‌ పొగుమ్‌ రెయిల్‌ సినిమాలో హీరోగా చేశారు. ఇందులో రాధిక హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం సూపర్‌ హిట్‌ కావడంతో తమిళంలో వరుస సినిమాలు చేశాడు. తర్వాత ఏమైందో ఏమోకానీ రూటు మార్చి టాలీవుడ్‌లో కమెడియన్‌గా, విలన్‌గా చేస్తూ ఇక్కడే స్థిరపడిపోయాడు.

చదవండి: వెయ్యిమందిని దాటి హీరోగా.. కానీ వైవాహిక జీవితంలో మాత్రం శరత్‌బాబు..

Advertisement
 
Advertisement
Advertisement