'విశ్వంభర' నుంచి చిరంజీవి పుట్టినరోజు కానుక | Chiranjeevi First Look Out From Vishwambhara Movie | Sakshi
Sakshi News home page

'విశ్వంభర' నుంచి చిరంజీవి పుట్టినరోజు కానుక

Aug 22 2024 1:05 PM | Updated on Aug 22 2024 1:20 PM

Chiranjeevi First Look Out From Vishwambhara Movie

చిరంజీవి హీరోగా నటిస్తున్న సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌ మూవీ ‘విశ్వంభర’. ఈ చిత్రానికి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. నేడు మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్‌ను మేకర్స్‌ ఇచ్చారు. విశ్వంభరలో చిరంజీవి ఫస్ట్‌ లుక్‌ను తాజాగా విడుదల చేశారు. పోస్టర్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది. త్రిశూలంతో చిరంజీవి కనిపించారు.

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విశ్వంభర నుంచి టీజర్‌ వస్తుందని అభిమానులు ఆశించారు. కానీ పోస్ట్‌ర్‌ ద్వార మెగాస్టార్‌ లుక్‌ను రివీల్‌ చేశారు.   'చీకటి, చెడు ఈ ప్రపంచాన్ని ఆక్రమించిన సమయంలో ఒక అద్భుతమైన తార పోరాడేందుకు ప్రకాశిస్తుంది.' అని పోస్టర్‌ ద్వారా చిత్ర యూనిట్‌ తెలిపింది.

త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, కునాల్‌ కపూర్‌ ఇతర లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ‘విశ్వంభర’ క్లైమాక్స్‌ సన్నివేశాల చిత్రీకరణ తాజాగా పూర్తి అయిందని సమాచారం.  ‘‘చిరంజీవి చరిష్మాటిక్‌ ప్రెజెన్స్ తో ‘విశ్వంభర’ మునుపెన్నడూ లేని ఎక్స్‌పీరియన్స్ ను ప్రేక్షకులకు అందించడానికి రెడీ అవుతోంది. ‘విశ్వంభర’ క్లైమాక్స్‌ యాక్షన్  సీక్వెన్స్ విజువల్‌ వండర్‌లా ఉండబోతోంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 10న రిలీజ్‌ కానుంది. 

Advertisement
 
Advertisement
Advertisement