చిన్మయి షేర్‌ చేసిన వీడియో చూశారా? | Singer Chinmayi Sripaada Singing Kilimanjaro Song With Maasai People; Watch Video - Sakshi
Sakshi News home page

Chinmayi Sripaada: కిలిమంజారో సాంగ్‌ పాడుతూ వారితో డ్యాన్స్‌ చేసిన చిన్మయి

Published Fri, Nov 17 2023 4:50 PM

Chinmayi Sripaada Singing Kilimanjaro Song With Maasai People - Sakshi

చిన్మయి శ్రీపాద.. ఎన్నో హిట్‌ సాంగ్స్‌ పాడింది. కొంతమంది హీరోయిన్లకు గొంతు కూడా అరువిచ్చింది. సోషల్‌ మీడియాలోనూ తన గొంతు బలంగానే వినిపిస్తూ ఉంటుంది. ఎటువంటి వివాదాస్పద గొడవపైనా స్పందించేందుకు వెనుకాడదు, తన సమాధానం బలంగా వినిపిస్తుంది. మరీ ముఖ్యంగా మహిళల హక్కుల కోసం ఎప్పుడూ ప్రశ్నిస్తూ ఉంటుంది.

తాజాగా చిన్మయి ఓ ఆసక్తికర వీడియోను షేర్‌ చేసింది. రోబో సినిమాలో తను పాడిన కిలిమాంజారో పాటను మళ్లీ పాడింది. అందులో స్పెషల్‌ ఏముందనుకుంటున్నారా? మాసై తెగల గుంపుతో కలిసి ఈ పాట పాడుతూ వారితో కలిసి డ్యాన్స్‌ చేసింది. ఇది చూసిన అభిమానులు ఆ పాట మాకు ఇప్పటికీ ఫేవరెట్‌.. మీరు వారితో కలిసిపోయే విధానం చాలా బాగుంది అని కామెంట్లు చేస్తున్నారు.

చదవండి:  21 ఏళ్లకే విడాకులు.. జీవితంపై విరక్తి.. డిప్రెషన్‌.. చనిపోదామనుకున్నా..

 
Advertisement
 
Advertisement