‘మిస్టరీ’ పాట బాగుంది: చంద్రబోస్‌ | Chandrabose Launches Mystery Movie Yedurayye Savaallu Song, Goes Viral - Sakshi
Sakshi News home page

‘మిస్టరీ’ పాట బాగుంది: చంద్రబోస్‌

Sep 30 2023 4:13 PM | Updated on Sep 30 2023 4:58 PM

Chandrabose Launches Mystery Movie Song - Sakshi

అలీ, తనికెళ్ల భరణి, సుమన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కామెడీ థ్రిల్లర్‌ ‘మిస్టరీ’. తల్లాడ సాయికృష్ణ దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా నటిస్తున్నాడు. స్నప్ప చౌదరి హీరోయిన్‌. అక్టోబర్‌ 13న ఈ చిత్రం విడుదల కాబోతుంది. తాజాగా ఈ మూవీ నుంచి 'ఎదురయ్యే సవాళ్లు' పాట ను ఆస్కార్ అవార్డ్ విజేత పాటల రచయిత చంద్ర బోస్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామ్ తవ్వ స్వరపరిచిన 'ఎదురయ్యే సవాళ్లు' చాలా బాగుంది. ఈ పాటకి సాహిత్యం అందించిన శ్రీనివాస్ సూర్య కి, పాడిన మనోజ్ కి అభినందలు. ఈ చిత్రం సూపర్‌ హిట్‌ కావాలని ఆశిస్తున్నాను’అని అన్నారు. ‘ఇదొక కామెడీ థ్రిల్లర్‌. ఔట్‌పుట్‌ బాగొచ్చింది. పాటలతో పాటు సినిమా కూడా అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది’అని డైరెక్టర్‌ సాయికృష్ణ అన్నారు. నేను అడగగానే మా సినిమా లోని పాటని చంద్రబోస్ గారు విడుదల చేయడం నా అదృష్టం గా భావిస్తున్నాను’అని హీరోయిన్‌ స్వప్న చౌదరి అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement