Alia Bhatt: బేబీ ఆలియా భట్‌.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

Bollywood Actress Alia Bhatt Childhood Video Goes Viral in Social Media - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌ పరిచయం అక్కర్లేని పేరు. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాల్లో నటించింది. ఆలియా, రణ్‌బీర్ కపూర్‌ జంటగా అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన బ్రహ్మస్త్ర- పార్ట్ 1 అద్భుత విజయాన్ని సాధించింది. ఇటీవలే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఈ బాలీవుడ్ బ్యూటీ. దీంతో ఆలియా కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. గంగూభాయ్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి క్రేజీ ప్రాజెక్టుల్లో తనదైన నటనతో మెప్పించింది.  

తాజాగా ఆలియా భట్‌కు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ వీడియోలో ఆమెకు ఏడాది వయసులో తన తండ్రి మహేశ్ భట్‌పై ఆడుకుంటూ కనిపించింది. బాలీవుడ్ స్టార్ నటి చిన్ననాటి త్రోబాక్ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. ఆ వీడియోలో బేబీగా ఉన్న అలియా పింక్ డ్రెస్‌లో చాలా క్యూట్‌గా కనిపిస్తోంది.

బాలల దినోత్సవం సందర్భంగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.  ఆమె తండ్రి మహేష్ భట్ ఫోన్‌లో మాట్లాడుతూ..'డార్లింగ్ అలియా'కు పుట్టినరోజు శుభాకాంక్షలు అని పాట పాడుతూ కనిపించారు. అయితే అలియా వాస్తవానికి వీడియోను ఆమె 25వ పుట్టినరోజున అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top