బ్రహ్మ కాకుండా నామినేషన్‌లో ఉన్నది ఎవరంటే? | Bigg Boss Telugu 5: These Contestants Are In Nominations For 9th Week | Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu Promo: కెప్టెన్‌ మినహా అందరూ నామినేషన్‌లో!

Nov 1 2021 7:21 PM | Updated on Nov 1 2021 7:32 PM

Bigg Boss Telugu 5: These Contestants Are In Nominations For 9th Week - Sakshi

'ప్రియాంక నీ గేమ్‌ నువ్వే ఆడు, వేరే గేమ్‌ ఆడొద్దు' అంటూ నామినేట్‌ చేశాడు షణ్ను. 'నీ ఇంటి పేరు పొగరా? నీ ఇంటిపేరు పొగరుబోతా?' అని కాజల్‌ను ప్రశ్నించాడు శ్రీరామ్‌.

Bigg Boss Telugu 5 Promo, 9th Week Nominations: బిగ్‌బాస్‌ హౌస్‌ కంటెస్టెంట్ల కోపతాపాలతో భగ్గున మండుతోంది. అసలే నామినేషన్స్‌ డే. వారిని కూల్‌ చేయడం బిగ్‌బాస్‌ వల్ల కూడా కాదు. ఫైర్‌ మీదున్న హౌస్‌మేట్స్‌ మాస్క్‌ తీసి నామినేషన్‌ ప్రక్రియ మొదలుపెట్టారు. ఈ క్రమంలో రవి- మానస్‌కు, శ్రీరామ్‌- కాజల్‌కు, శ్రీరామ్‌- మానస్‌కు మధ్య పెద్ద గొడవే జరిగినట్లు తెలుస్తోంది.

'నీ ఇంటి పేరు పొగరా? నీ ఇంటిపేరు పొగరుబోతా?' అని కాజల్‌ను ప్రశ్నించాడు శ్రీరామ్‌. దీనికి కాజల్‌ స్పందిస్తూ.. నీ రియాక్షన్సే నచ్చడం లేదంటూ నామినేట్‌ చేసింది. తర్వాత రవిని నామినేట్‌ చేస్తూ.. నిన్ను ఎదగకుండా ఆపడానికి  ట్రై చేయలేదని.. తనే కాదు, హౌస్‌లో ఎవరూ ఆ పని చేయలేరని చెప్పింది. ఇక పింకీ వంతు రాగా రవి అన్న కంటే ఎవరూ బాగా ఆలోచించలేరంటూ నామినేట్‌ చేసింది. 'ప్రియాంక నీ గేమ్‌ నువ్వే ఆడు, వేరే గేమ్‌ ఆడొద్దు' అంటూ నామినేట్‌ చేశాడు షణ్ను. ఇలా అనేసి నామినేట్‌ చేసి బయటకు పంపించాక నా గేమ్‌ ఇంకెవరు ఆడతారు? అని ఫైర్‌ అయింది పింకీ. అతడు ఫోమ్‌ పూస్తుంటే అతడిని ఏమీ చేయలేక ఆ ప్లేటును గట్టిగా ముఖానికి కొట్టుకుంది.

నువ్వు వెళ్లిపోతే నాకు ఫరాఖ్‌ పడదని శ్రీరామ్‌ను నామినేట్‌ చేశాడు మానస్‌. నువ్వు ఉన్నా కూడా నాకు ఫరాఖ్‌ పడదని రివర్స్‌ కౌంటరిచ్చాడు రామ్‌. ఇక ఈ 9వ వారం నామినేషన్‌లో కెప్టెన్‌ షణ్ముఖ్‌ తప్ప మిగతా అందరూ నామినేట్‌ అయ్యారని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే యానీ గత ఆదివారం సంపాదించిన స్పెషల్‌ పవర్‌తో నామినేషన్‌ నుంచి బయటపడుతుందా? లేదా ఆ పవర్‌ను ఇప్పుడెందుకులే! అని భద్రంగా దాచిపెట్టుకుంటుందా? అన్నది చూడాలి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement