లోబో ఎలిమినేట్‌.. హౌస్‌లో ఆ ఆరుగురే లోబో శత్రువులు! | Bigg Boss Telugu 5: These 5 Contestants Lobo Friends. Other Housemates Enemies | Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌లో లోబో మిత్రువులు, శత్రువులు ఎవరో తెలుసా?

Oct 31 2021 10:41 PM | Updated on Nov 1 2021 7:15 PM

Bigg Boss Telugu 5: These 5 Contestants Lobo Friends. Other Housemates Enemies - Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ దీపావళి స్పెషల్‌ ఎపిసోడ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఆకాశాన్ని తాకింది. తారల డ్యాన్సులతో స్టేజీ దద్దరిల్లిపోయింది. బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్లు చేసిన రచ్చను ప్రేక్షకులు ఆస్వాదించారు. ఇక విజయ్‌ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండలను ఒకే స్క్రీన్‌పై చూసి ముచ్చటపడిపోయారు అభిమానులు. మొత్తానికి బోలెడంత ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించిన ఈ ఎపిసోడ్‌లో ఎలిమినేషన్‌ ఘట్టం కూడా ముగిసింది. 8వ వారం లోబో ఎలిమినేట్‌ అయ్యాడు. అతడి ఎలిమినేషన్‌తో హౌస్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇది నిజమా? కలా? అని కొంతమంది కంటెస్టెంట్లు షాక్‌లోకి వెళ్లిపోయారు.

ఈసారి సీక్రెట్‌ రూమ్‌, గట్రా ఏదీ ఉండదని అర్థమైన లోబో.. తనేదైనా తప్పుగా మాట్లాడితే క్షమించమని కాజల్‌ను వేడుకున్నాడు. స్టేజీ మీదకు వచ్చిన లోబోతో ఐదుగురు మిత్రువులు- ఆరుగురు శత్రువులు గేమ్‌ ఆడించాడు నాగార్జున. ఈ సందర్భంగా లోబో.. తొలుతగా ఫ్రెండ్స్‌ గురించి చెప్పుకొచ్చాడు. నాకు ఎల్లప్పుడూ బూస్ట్‌ ఇచ్చే విశ్వ తన ఫ్రెండ్‌ అని తెలిపాడు. అలాగే కాజల్‌, సన్నీ, రవి కూడా తన మిత్రువులేనని పేర్కొన్నాడు. ఇక ఐదో ఫ్రెండ్‌ యానీ గురించి చెప్తూ ఆమె కెప్టెన్‌ అయితే మా గల్లీలో పటాకులు కాలుస్తానన్నాడు. మిగిలిన షణ్ముఖ్‌, జెస్సీ, సిరి, మానస్‌, పింకీ శ్రీరామ్‌.. శత్రువులని చెప్పకనే చెప్పాడు.

Advertisement
 
Advertisement
Advertisement