సెట్ శ్వేత పారితోషికం ఎంతో తెలుసా? | Bigg Boss Telugu 5: Swetha Varma Remuneration For Bigg Boss Show | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 5: బిగ్‌బాస్ నుంచి శ్వేత‌కు ఎంత ముట్టిందంటే?

Oct 17 2021 11:59 PM | Updated on Oct 18 2021 9:30 AM

Bigg Boss Telugu 5: Swetha Varma Remuneration For Bigg Boss Show - Sakshi

టాస్కుల్లోనూ విరుచుకుప‌డుతూ ప్ర‌త్య‌ర్థుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించేది. త‌న యాటిట్యూడ్‌తో, ముక్కుసూటిత‌నంతో మిగ‌తావారిని డామినేట్ చేస్తూ వ‌స్తోంది. బిగ్‌బాస్ ద్వారా ఆమెకు సుమారు..

Bigg Boss 5 Telugu, Swetha Varma Remuneration: చాలామంది సెల‌బ్రిటీల‌కు బిగ్‌బాస్‌కు వెళ్లాల‌నేది ఓ క‌ల‌. కానీ అంద‌రికీ ఆ క‌ల నెర‌వేర‌దు, కొంద‌రిని మాత్ర‌మే ఆ అవ‌కాశం వ‌రిస్తుంది. ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర చేసే ఈ షోలో పార్టిసిపేట్ చేయ‌డం కోసం మిగ‌తా ప్రాజెక్టుల‌ను ప‌క్క‌న‌ప‌డేసి మ‌రీ హౌస్‌లో అడుగుపెడుతుంటారు తార‌లు. బిగ్‌బాస్ కూడా వారికి భారీ స్థాయిలోనే పారితోషికం ముట్ట‌జెప్తూ వారిని సంతృప్తి ప‌రుస్తుంటాడు. అయితే పాపులారిటీని బ‌ట్టి ఈ పారితోషికం ఒక్కొక్క‌రికి ఒక్కోలా ఉంటుంది. తాజాగా హౌస్‌లో ఎలిమినేట్ అయిన శ్వేత వ‌ర్మ‌కు ఎంత ముట్టింద‌నేది ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ద రోజ్ విల్లా, ముగ్గురు మొన‌గాళ్లు, ప‌చ్చీస్‌, సైకిల్ వంటి ప‌లు చిత్రాల్లో న‌టించిన శ్వేత ప‌లు వెబ్‌ సిరీస్‌లోనూ యాక్ట్ చేసింది. మ‌న‌సుకు న‌చ్చిన‌ ప్రాజెక్టులు చేసుకుంటూ పోతున్న ఆమెకు కావాల్సినంత గుర్తింపు అయితే రాలేదు. ఈ క్ర‌మంలో త‌న‌కు వ‌చ్చిన బిగ్‌బాస్ ఆఫ‌ర్ ద్వారా ఇండ‌స్ట్రీలో ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌వ్వాల‌నుకుంది. ఇండ‌స్ట్రీలో బిజీ న‌టిగా మారిపోవాల‌నుకుంది. అనుకున్న‌దే త‌డ‌వుగా ఆఫ‌ర్‌కు ప‌చ్చ‌జెండా ఊపుతూ హౌస్‌లో అడుగు పెట్టింది. మొద‌ట్లో ఉందా? లేదా? అన్న‌ట్లు సైలెంట్‌గా ఉన్న శ్వేత ఒకానొక నామినేష‌న్స్‌లో ఉగ్ర‌రూపం చూపించింది. అమ‌ర్యాద‌గా మాట్లాడుతున్నావంటూ లోబోను చెడుగుడు ఆడేసింది. ఫేక్‌గా ఆడుతున్నావంటూ హ‌మీదాను కొట్టినంత ప‌ని చేసింది.

ఇక టాస్కుల్లోనూ విరుచుకుప‌డుతూ ప్ర‌త్య‌ర్థుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించేది. త‌న యాటిట్యూడ్‌తో, ముక్కుసూటిత‌నంతో మిగ‌తావారిని డామినేట్ చేస్తూ వ‌స్తోంది. యానీ మాస్ట‌ర్‌ను అమ్మ‌గా పిలుచుకునే శ్వేత త‌న‌తో పెట్టుకుంటే ఇచ్చిప‌డేసేది. ఆరో వారంలో నామినేష‌న్‌లోకి వ‌చ్చి ఎలిమినేట్ అయిన శ్వేత బిగ్‌బాస్ ద్వారా ఎంత సంపాదించింది? అని ఆరా తీయ‌డం మొద‌లు పెట్టారు నెటిజ‌న్లు. అయితే సోష‌ల్ మీడియాలో వినిపిస్తున్న చ‌క్క‌ర్లు కొడుతున్న స‌మాచారం ప్ర‌కారం వారానికి ఆమెకు రూ. 60- 90 వేల వ‌ర‌కు ఇస్తున్నార‌ట‌! ఆమె ఆరువారాల‌పాటు హౌస్‌లో కొన‌సాగింది. ఈ లెక్క‌న ఆమెకు బిగ్‌బాస్ ద్వారా సుమారు 5 ల‌క్ష‌ల ఆదాయం వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది!

Advertisement
 
Advertisement
Advertisement