బిగ్‌బాస్‌ నుంచి భర్త ఎలిమినేట్‌.. సంతోషంగా ఉందంటున్న భార్య | Bigg Boss OTT 3: Payal Feels Happy for Armaan Malik Elimination | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ నుంచి భర్త ఎలిమినేట్‌.. నేనైతే హ్యాపీ అంటోన్న మొదటి భార్య

Aug 1 2024 5:20 PM | Updated on Aug 1 2024 5:40 PM

Bigg Boss OTT 3: Payal Feels Happy for Armaan Malik Elimination

కృతిక, అర్మాన్‌, పాయల్‌

బిగ్‌బాస్‌ వల్ల పాపులారిటీ వస్తుందన్న విషయం పక్కనపెడితే దానివల్ల బంధాలు, కెరీర్‌ నాశనమైపోయిన సంఘటనలు కూడా కోకొల్లలు. ప్రస్తుతం హిందీలో బిగ్‌బాస్‌ ఓటీటీ మూడో సీజన్‌ రన్‌ అవుతోంది. ఈసారి అర్మాన్‌ మాలిక్‌ అనే యూట్యూబర్‌ తన ఇద్దరు భార్యలతో కలిసి షోలో అడుగుపెట్టాడు. హవ్వ, ఇదేం ఘోరం, ఇంకెవరూ దొరకలేదా? అని జనాలు నోరెళ్లబెట్టారు. ముగ్గురూ కలిసిమెలిసి బాగానే ఉన్నారు.

కృతిక అందంగా ఉందని కామెంట్‌
ఇంతలో ఓ వారం పాయల్‌ ఎలిమినేట్‌ అయిపోయింది. ఇకపోతే బిగ్‌బాస్‌ హౌస్‌లోని ఓ కంటెస్టెంట్‌ విశాల్‌ పాండే.. అర్మాన్‌ రెండో భార్య కృతికని అందంగా ఉందని కామెంట్‌ చేశాడు. వీకెండ్‌లో బిగ్‌బాస్‌కు వెళ్లిన పాయల్‌.. ఈ విషయంపై రాద్దాంతం చేసింది. తన మొదటి భార్యపై కామెంట్‌ చేశాడన్న కోపంతో అర్మాన్‌.. విశాల్‌ చెంప చెళ్లుమనిపించాడు. దీనిపై సోషల్‌ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది.

పాయల్‌పై ట్రోలింగ్‌
ఈ గొడవ అంతటికీ కారణం నువ్వేనంటూ నెటిజన్లు పాయల్‌ను ఏకిపడేశారు. ఇది తట్టుకోలేకపోయిన పాయల్‌.. ఈ విమర్శల వల్ల ఒత్తిడికి లోనవుతున్నానని, బిగ్‌బాస్‌ నుంచి భర్త బయటకు వచ్చాక విడాకుల గురించి మాట్లాడతానంది. తాజాగా అర్మాన్‌ ఎలిమినేట్‌ అవడంతో సంతోషం వ్యక్తం చేసింది.

ఇక ఆపేయండి
అర్మాన్‌ బయటకు వచ్చినందుకు హ్యాపీ. మీరు కూడా సంతోషంగా ఉన్నారనుకుంటాను. బహుశా స్వీట్లు కూడా పంచుకుంటారేమో! ఇంత ద్వేషాన్ని భరించేబదులు బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చేయడమే మేలు. మీరు బలంగా కోరుకున్నారు కాబట్టే బయటున్నాడు. సంతోషమే కదా.. ఇకనైనా ద్వేషించడం ఆపండి అని చెప్పుకొచ్చింది.

చదవండి: ఈ జీవితాన్ని అందంగా మార్చేశావ్‌.. థాంక్యూ: మౌనిక

Advertisement
 
Advertisement
Advertisement