
Bigg Boss Telugu 5, Episode 47: లోబో రీ ఎంట్రీతో బిగ్‌బాస్ హౌస్‌లో గ్రూపుల మొదలయ్యాయి. తన ప్రాణ స్నేహితుడు మళ్లీ తిరిగి రావడంతో రవి రెచ్చిపోయాడు. టాప్ 5 ఉండేలా ప్లాన్ వేశాడు. మరోవైపు సీక్రెట్ టాస్క్‌లో జెస్సీ ఓడిపోయి కెప్టెన్సీ పోటీదారులయ్యే అవకాశాన్ని కోల్పోయాడు. ఊహించని షాక్ తగలడంతో త్రిమూర్తులు గిలగిల కొట్టుకున్నారు. ఓటమిని జీర్ణించుకోలేని షణ్ణ్ముఖ్.. జెస్సీ, సిరిలపై గట్టిగా అరిచాడు. నిన్నటి వరకు ఒకరిపై ఒకరు కారాలు, మీరాలు నూరుకున్న సన్నీ, ప్రియా కలిసిపోయేందుకు సిద్దమయ్యారు. ఇలా నేటి ఎపిసోడ్‌లో చాలా ఇంట్రెస్టింగ్ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అవేంటో చదివేద్దాం.
స్పైసీ నూడుల్స్ తిను.. ఐదు గుడ్లు తిను
కెప్టెన్సీ పోటీదారుల కోసం ఇంటిసభ్యులకు బిగ్‌బాస్ ‘బంగారు కోడిపెట్ట’ టాస్క్ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా మానస్‌కు స్పెషల్ పవర్ ఉన్న ఒక రెడ్ కలర్ గుడ్డు లభించింది. దాని ద్వారా ఐదు గుడ్లను పొందే అవకాశం లభించింది. దానికి కోసం ‘స్పైసీ నూడుల్స్ తిను’అనే టాస్క్‌ని ఇచ్చాడు బిగ్‌బాస్. మానస్‌తో పాటు ఆయన ఎంచుకున్న మరో వ్యక్తి ఈ టాస్క్ ఆడాల్సి ఉంటుంది. ఈ గేమ్ కోసం మానస్.. సన్నీని ఎంచుకున్నాడు. ఇద్దరూ కారం ఎక్కువగా ఉన్న నూడూల్స్ తిన్నారు. మానస్ కంటే సన్నీ కొంచెం ఎక్కువగా తిని ఐదు గుడ్లను సొంతం చేసుకున్నాడు.
కెప్టెన్సీ బరిలో ఐదుగురు.. జెస్సీకి ఊహించని షాక్
కెప్టెన్సీ పోటీదారుల కోసం నిర్వహించిన ‘బంగారు కోడిపెట్ట’టాస్క్‌ని ముగిసినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. అందులో ఎక్కువగా గుడ్లు సంపాదించిన విశ్వ, మానస్, శ్రీరామ్, రవి, సన్నీలు కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచారు. ఇక సీక్రెట్ టాస్క్‌ని రూల్స్ ప్రకారం ఆడకపోవడంతో జెస్సీని కెప్టెన్సీ పోటీకి అనర్హుడిగా ప్రకటించాడు బిగ్‌బాస్. సీక్రెట్ టాస్క్ రూల్ ప్రకారం.. ఇంటి సభ్యులలో ఎవరైనా ముగ్గురు దగ్గర ఎగ్స్‌ను జీరో చేయాలని చెప్పాడు. కానీ జెస్సీ మాత్రం ఆట ఆడకుండా వారిని రిక్వెస్ట్ చేసుకుని జీరో ఎగ్స్ ఉంచేలా చేశాడు. అలా ఆట ఆడుకుండా వారిని బతిమాలాడి ఒప్పించడం వల్ల జెస్సీ కెప్టెన్సీ పోటీదారులైన అర్హతను కోల్పోయాడు.
నాకు గేమ్ ఆడడం కూడా రాదు.. షణ్ముఖ్ ఎమోషనల్
సీక్రెట్ టాస్క్‌లో జెస్సీ విఫలం కావడం.. కెప్టెన్సీ దారుడిగా పోటీ చేసే అవకాశాన్ని కోల్పోవడంతో షణ్ముఖ్ సహనాన్ని కోల్పోయాడు. తన స్నేహితులైన సిరి, జెస్సీలపై పిచ్చి పిచ్చిగా అరిచాడు. ముఖ్యంగా ఈ టాస్క్‌లో జెస్సీకి సిరి సాయం చేయడాన్ని షణ్ముఖ్ జీర్ణించుకోలేకపోయాడు. ఫ్రెండ్ అనుకుని నన్ను ఎదవను చేశారు.. నేను దేనికి పనికి రాను.. ఆట ఆడటం రాదు అని నన్ను సెలెక్ట్ చేసుకున్నారు.. ఇంట్లో అందరూ అలానే చూస్తున్నారు. బయటకు వెళ్లాక కూడా అందరూ అదే అంటారు అని షణ్ణ్నూ తెల ఫీలయ్యాడు. అందరూ టాస్క్ సరిగ్గా ఆడడని అంటున్నారని, తనను అందరూ పిచ్చ లైట్ తీసుకుంటున్నారని జెస్సీ, సిరిల ముందు షణ్ముఖ్ వాపోయాడు.‘జెస్సీ కెప్టెన్ అవ్వాలనుకున్నాడు. నువ్వు సాయం చేశావు. చివరికి నేను మోసపోయాను. నాకు గేమ్ ఆడడం కూడా రాదు.. అదే నా దరిద్రం’ అంటూ షణ్ముఖ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. జెస్సీ, సిరి ఇద్దరు సంజాయిషీ ఇచ్చే ప్రయత్నం చేసినా షణ్ముఖ్ ఆగకుండా సిరిని అక్కడి నుంచి వెళ్లిపో అంటూ అరిచాడు. దీంతో సిరి కూడా కన్నీళ్లు పెట్టుకుంది.
లోబో రీఎంట్రీ... రవి ఎమోషనల్
ఇప్పటి వరకు సీక్రెట్ రూమ్‌లో ఉన్న లోబో రీ ఎంట్రీ ఇచ్చాడు. మెయిన్ గెట్ తెరుచుకోవడం, అక్కడ లోబో నిలబడి ఉండటం చూసిన రవి.. లోబో వచ్చాడు అంటూ చెప్పడంతో అందరి ముఖంలో ఆనందం కనిపించింది. రవి పరిగెత్తుకుంటూ వెళ్లి లోబోను గట్టిగా హత్తుకొని ఏడ్చేశాడు. ఈ సమయంలో త్రిమూర్తులు(షణ్ముఖ్, సిరి, జెస్సీ) ఇంట్లోనే ఉండగా.. మిగిలిన సభ్యులంతా గార్డెన్ ఏరియాకు వచ్చి లోబోకి స్వాగతం పలికారు.
లోబోకి స్పెషల్ పవర్.. కాజల్‌కు బంపర్ ఆఫర్
రీఎంట్రీ ఇచ్చిన లోబోకి స్పెషల్ పవర్ ఇచ్చాడు బిగ్‌బాస్. అతనికి బ్లాక్, గొల్డెన్ ఎగ్స్ ఇచ్చాడు. వాటిద్వారా కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచిన ఐదుగురిలో నుంచి ఒకరిని తొలగించొచ్చు. మరొకొరిని కెప్టెన్సీ పోటీదారుడిగా ఎంపిక చేయ్యొచ్చు. బ్లాక్ ఎగ్ ఎవరికిస్తే వారు కెప్టెన్సీ పోటీదారుల నుంచి ఔట్ అయినట్లు. గొల్డెన్ ఎగ్ పొందిన వారు డెరెక్ట్‌గా కెప్టెన్సీ పోటీదారుడిగా ఎంపికైతారు. లోబో ఈ స్పెషల్ పవర్ ఉపయోగించి శ్రీరామ్‌ని తొలగించి, కాజల్‌ని కెప్టెన్సీ పోటీదారుగా ఎంపిక చేశాడు.
టాప్ 5లో మనమే ఉండాలి: రవి
సీక్రెట్ రూమ్ ఉండి అందరి గేమ్‌ని పరిశీలించిన లోబో.. ఆ సీక్రెట్స్ అన్ని రవితో పంచుకున్నాడు. లోబో మాటలతో రవికి కొత్త ఉత్సాహం వచ్చింది. శ్రీరామ్, విశ్వ, యానీ, లోబోలతో కలిసి మాస్టర్ ప్లాన్ వేశాడు. మనమంతా కలిసి గేమ్ ఆడుదామని, టాప్ 5లో మనమే ఉండాలని చెప్పుకొచ్చాడు. విశ్వకి కండబలం, నాకు బుద్ది బలం, లోబోకి రెండు ఉన్నాయని, ఎంటర్‌టైన్‌మెంట్ అంటే ఎలా ఉంటుందో ఇకపై చూపిద్దామని చిటికలేసి మరీ చెప్పాడు.