అతి అభిమానం ఆరోగ్యానికి చాలా హానికరం.. బండ్ల గణేశ్ పోస్ట్ వైరల్! | Bandla Ganesh Tweet On Social Media Goes Viral | Sakshi
Sakshi News home page

Bandla Ganesh: అతి అభిమానం చాలా హానికరం.. బండ్ల గణేశ్ ట్వీట్ వైరల్!

Jun 13 2025 7:34 PM | Updated on Jun 13 2025 8:12 PM

Bandla Ganesh Tweet On Social Media Goes Viral

టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌ ఏది చేసిన వెరైటీగానే ఉంటుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే ఆయన.. జీవితానికి సంబంధించిన పోస్టులు పెడుతుంటారు. తాజాగా బండ్ల గణేశ్‌ ట్విటర్‌ వేదికగా చేసిన నెట్టింట వైరల్‌గా మారింది. అతి ప్రేమ.. అతి అభిమానం.. అతి విశ్వాసం.. అతి నమ్మకం.. ఆరోగ్యానికి హానికరం అంటూ ట్వీట్ చేశారు. అయితే ఇది కేవలం మన లైఫ్‌ కోటేషన్ తరహాలోనే పోస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. తనకు నిజ జీవితంలో ఎదురైన అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నట్లుగా కనిపిస్తోంది.

ఇటీవల బండ్ల గణేశ్‌ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావును కలిశారు. అనారోగ్యంతో ఉన్న ఆయనను కలిసి పరామర్శించారు. కోట శ్రీనివాసరావుతో దిగిన ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోలో కోట శ్రీనివాసరావు గుర్తు పట్టలేనంతగా మారిపోయినట్లు కనిపించారు. కాగా.. టాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటుడిగి మెప్పించిన బండ్ల గణేశ్.. నిర్మాతగాను తనదైన ముద్రవేశారు. పలు సూపర్ హిట్ చిత్రాలను ఆయన నిర్మించారు.

Advertisement
 
Advertisement
Advertisement