'Baby' Actress Kirrak Seetha Gets Death Threats For On-Screen Character - Sakshi
Sakshi News home page

Baby Movie Kirrak Seetha: కిరాక్ సీతకు లైంగిక వేధింపులు.. ఆ రోజు!

Jul 24 2023 5:47 PM | Updated on Jul 24 2023 5:59 PM

Baby Movie Kirrak Seetha Interview Comments - Sakshi

విడుదలైన 10 రోజులు అవుతున్నా 'బేబీ' దూకుడు తగ్గట్లేదు. ఇందులో హీరోహీరోయిన్లు వైష్ణవి, ఆనంద్, విరాజ్‌తోపాటు సహాయ పాత్రల్లో నటించిన వాళ్లు తమ యాక్టింగ్‌తో ఇచ్చిపడేశారు. హీరోయిన్ ఫ్రెండ్‌గా నెగిటివ్ క్యారెక్టర్ చేసిన కిరాక్ సీత ఆకట్టుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈమె.. తనని కొందరు లైంగిక వేధించేందుకు ప్రయత్నించారనే విషయాన్ని బయటపెట‍్టింది.

'ఓ ఈవెంట్‌కి నేను వెళ్లొస్తున్న టైంలో కొందరు కుర్రాళ్లు వెంటబడ్డారు. నా ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసి ఈ విషయం చెబితే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వమని సలహా ఇచ్చారు. కానీ నేను అలా చేయలేదు. కొందరైతే నన్ను రేప్ చేస్తాం, చంపేస్తామని బెదిరించారు. మరికొందరు నా అడ్రస్ తెలుసుకోవడానికి ట్రై చేశారు. కానీ వీటన్నింటినీ నేను లైట్ తీసుకున్నాను'

(ఇదీ చదవండి: కలెక్షన్స్‌లో 'బేబీ' ఆల్‪‌టైమ్ రికార్డ్!)

'నన్ను అంతలా బెదిరించినా సరే వాటిని నేను లైట్ తీసుకోవడానికి ఒక్కటే కారణం. నా రీల్ లైఫ్ క్యారెక్టర్ చూసి, వాళ్లు ఈ అభిప్రాయానికి వచ్చారు. కానీ నా రియల్ లైఫ్ వేరే అని వాళ్లకు తెలీదు. అందుకే వాటిని పట్టించుకోలేదు. 'బేబీ'లో పాత్ర వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉందని డైరెక్టర్ నాకు ముందే చెప్పారు' అని కిరాక్ సీత చెప్పుకొచ్చింది. 

గతంలో యూట్యూబర్ సరయూతో కలిసి వర్క్ చేసిన ఈమె.. ఆ తర్వాత ఏదో సమస్య కావడంతో ఆ ఛానెల్ నుంచి బయటకొచ‍్చేసింది. ప‍్రస్తుతం అడపాదడపా సినిమాల్లో బోల్డ్ తరహా పాత్రల్లో చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి ఈమె, తనని కొందరు బెదిరించారని చెప్పడం చర్చనీయాంశంగా మారిపోయింది. 

(ఇదీ చదవండి: 'బేబీ' ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్)

Advertisement
 
Advertisement
Advertisement