Baby Movie Heroine Vaishnavi Chaitanya Reveals About Her First Remuneration, Deets Inside - Sakshi
Sakshi News home page

Vaishnavi Chaitanya First Remuneration: 'బేబీ' తొలి పారితోషికం.. మరీ ఇంత తక్కువా!?

Jul 16 2023 4:08 PM | Updated on Jul 16 2023 5:24 PM

Baby Movie Heroine Vaishnavi Chaitanya First Remuneration - Sakshi

Baby Heroine Remuneration:'బేబీ' సినిమా హిట్ అయింది. ఓ మాదిరి అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది. అయితేనేం రెండో రోజే లాభాల్లోకి వెళ్లిపోయింది. మూవీ చూసిన ప్రతి ఒక్కరూ హీరోయిన్ వైష్ణవి చైతన్య గురించి మాట్లాడుకుంటున్నారు. ఆమె పాత్రని తెగ తిట్టుకుంటున్నారు. ఆమె నటనకి కనెక్ట్ అయిపోయారు కాబట్టి ఇలా మాట్లాడుకుంటున్నారు. మరి వైష్ణవి ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు.

టాలీవుడ్ లో ప్రస్తుతం 'బేబీ' హీరోయిన్ వైష్ణవి చైతన్య పేరు గట్టిగా వినిపిస్తోంది. ఎందుకంటే సినిమాలోని పాత్రలో జీవించేసింది. లిప్ లాక్, బోల్డ్ సీన్స్ ఇలా ఏ విషయం తీసుకున్నా సరే ఎఫర్ట్ మొత్తం పెట్టింది. దీంతో ఈమెని అందరూ తెగ మెచ్చుకుంటున్నారు. అప్పుడెప్పుడో డబ్ స్మాష్ నుంచి టిక్ టాక్ ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్ తో ఒక్కో స్టెప్ ఎదుగుతూ ఇక్కడి  వరకు వచ్చింది.

(ఇదీ చదవండి: 'బేబీ' కలెక్షన్స్.. రెండు రోజుల్లోనే అన్ని కోట్లు)

యూట్యూబ్ సిరీస్ 'సాఫ్ట్‌వేర్ డెవలపర్'తో బోలెడంత ఫేమ్ తెచ్చకున్న వైష్ణవి చైతన్య.. 'అల వైకుంఠపురములో' చిత్రంలో అల్లు అర్జున్ చెల్లెలిగా నటించింది. అయితే తను తొలిసారి అందుకున్న పారితోషికం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్వయానా వైష్ణవినే బయటపెట్టింది. కేవలం రూ.700 మాత్రమే ఇచ్చారని చెప్పుకొచ్చింది. 

'ఓ ఈవెంట్ కోసం డ్యాన్స్ చేసే అవకాశం వచ్చింది. రోజంతా కష్టపడి డ్యాన్స్ చేస్తే జస్ట్ రూ.700 మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు ఎంత సంపాదించినా సరే నాకు మాత్రం ఆ ఏడొందలు చాలా స్పెషల్' అని వైష్ణవి చైతన్య చెప్పుకొచ్చింది. ఇకపోతే 'బేబీ' సినిమాకు ఎంత రెమ్యునరేషనే తీసుకుందనేది మాత్రం తెలియట్లేదు. బహుశా రూ.10 లక్షల లోపే ఇచ్చి ఉండొచ్చని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.

(ఇదీ చదవండి: రెండో సినిమాకే లక్షలు తీసుకుంటున్న అల్లు అర్హ!)

Advertisement
 
Advertisement
Advertisement