Baby Movie Director Sai Rajesh Comments On Vaishnavi Chaithanya - Sakshi
Sakshi News home page

Baby Movie-Vaishnavi Chaitanya: బేబీ హీరోయిన్‌గా వైష్ణవి.. అసలు కారణమిదేనన్న డైరెక్టర్!

Jul 23 2023 3:49 PM | Updated on Jul 23 2023 4:16 PM

Baby Movie Director Sai Rajesh Comments On Vaishnavi Chaithanya - Sakshi

చిన్న సినిమా అయినా బాక్సాఫీస్‌ షేక్ చేస్తోంది. విడుదలైన వారం రోజుల్లోనే రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించి దూసుకెళ్తోంది. ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీగా ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన బేబీ మూవీ బ్లాక్‌ బస్టర్‌ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం రూ.60 కోట్ల మార్కును దాటేసింది. కంటెంట్ ఉంటే చాలు.. సినిమాలకు ఆదరణ తగ్గదని ఈ చిత్రం మరోసారి రుజువు చేసింది. సినీ ప్రముఖులు కూడా బేబి మూవీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ  ప్రతి పాత్ర అందరిని కదిలించిందని చెప్పుకొచ్చారు. 

(ఇది చదవండి: నటితో డేటింగ్‌.. నాకంత టైం కూడా లేదు!)

ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ ప్రధాన పాత్రల్లో నటించగా.. హృదయ కాలేయం సినిమాతో హిట్‌ కొట్టిన సాయి రాజేశ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సాయి రాజేశ్.. ఈ చిత్రంలో హీరోయిన్‌గా వైష్ణవి తీసుకోవడంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎందుకంటే వైష్ణవి పాత్ర డైలాగ్స్‌ ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి.  ఈ నేపథ్యంలో డైరెక్టర్ చేసిన కామెంట్స్ తెగ వైరలవుతున్నాయి. 

సాయి రాజేశ్ మాట్లాడుతూ.. ' ఈ సినిమాకు వైష్ణవి తీసుకోవడం వెనుక ప్రత్యేక కారణం ఉంది. నేను ఈ చిత్రం కథ రాసుకున్నప్పుడు మొదట తెలంగాణ అమ్మాయినే తీసుకోవాలనుకున్నా. అంతే కాదు తెలంగాణ భాష, యాసపై పట్టున్న అమ్మాయి అయితేనే ఈ పాత్రకు న్యాయం చేస్తుందని భావించా. అలా అనుకున్న సమయంలో మా మేనేజర్ వైష్ణవి ఫోటోను నాకు చూపించారు. దీంతో నేను ఆలస్యం చేయకుండా వైష్ణవి సంప్రదించా. ఫస్ట్ తను ఈ కథ చెప్పగానే అంగీకరించలేదు. ఆ తర్వాత నేను ప్రతి సీన్ గురించి తనకు వివరించి చెప్పా. ఆ తర్వాతే తను అంగీకరించింది. నేను చెప్పిన ప్రతి సీన్‌ చాలా అద్భుతంగా చేసింది.' అని అన్నారు. 

(ఇది చదవండి: కేవలం తొమ్మిది రోజుల్లోనే 'బేబీ'కి ఇన్ని కోట్ల కలెక్షన్సా?)

Advertisement
 
Advertisement
Advertisement