విడుదలకు సిద్ధమైన ‘బాబు’ | Babu Completed All The Formalities And Is Ready For Release | Sakshi
Sakshi News home page

విడుదలకు సిద్ధమైన ‘బాబు’

Jan 21 2024 11:16 AM | Updated on Jan 21 2024 11:16 AM

Babu Completed All The Formalities And Is Ready For Release - Sakshi

అర్జున్ కళ్యాణ్ హీరోగా, కుషిత కల్లాపు హీరోయిన్‌గా రాబోతోన్న చిత్రం ‘బాబు’. ట్యాగ్ లైన్ ‘నెంబర్ వన్ బుల్ షిట్ గై’. డీడీ క్రియేషన్స్ బ్యానర్ మీద దండు దిలీప్ కుమార్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎల్ఆర్ (లక్ష్మణ్ వర్మ) ఈ సినిమాకు దర్శకుడు.  విలాసం కన్నా అవసరం గొప్పది అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కించారు.

ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉండబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. త్వరలోనే విడుదలకు సిద్దం కానుంది. ఇప్పటికే వదిలిన ప్రమోషనల్ కంటెంట్ అందరినీ ఆకట్టుకుంది. ఇక మున్ముందు మరింతగా ప్రమోషనల్ కార్యక్రమాలను పెంచనున్నారు మేకర్లు.
 

Advertisement
 
Advertisement
Advertisement