Jayamma Panchayathi: Anchor Suma Reveals Tatoo Secret, See Details Inside - Sakshi
Sakshi News home page

Suma Tatoo Secret: సుమ చేతిపై ఆ వ్యక్తి పేరు.. సీక్రెట్‌ రివీల్‌ చేసిన యాంకరమ్మ

May 3 2022 2:33 PM | Updated on May 3 2022 3:15 PM

Anchor Suma Reveals Tatoo Secret - Sakshi

బుల్లితెర పాపులర్‌ యాంకర్‌ సుమ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. వెన్నెల క్రియేషన్స్‌ పతాకంపై బలగ ప్రకాష్‌ నిర్మించిన‌ ఈ చిత్రానికి విజయ్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మే 6న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయింది సుమ. తాజాగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

(చదవండి: హాలీడే మూడ్‌లో చిరంజీవి.. శ్రీజ, ఉపాసన స్వీటెస్ట్‌ కామెంట్‌)

తన చేతిపై ఉన్న పంచబొట్టు సీక్రెట్‌ని కూడా రిలీల్‌ చేశారు. చేతిపై ‘వెంకన్న’అని పచ్చబొట్టు వేయించుకున్నారు సుమ. ఆ పేరు వెనక ఉన్న సీక్రెట్‌ ఏంటని అడిగితే.. సినిమా చూస్తే తెలుస్తుందని చెప్పారు. సెకండాఫ్‌లో ఆ పేరు ఎందుకు వేయించుకున్నానో అందరికి తెలుస్తుందని సుమ చెప్పుకొచ్చారు. ఇక రాజీవ్‌ కనకాలతో సినిమా చేసే అవకాశం ఉందా అని అడగ్గా.. మంచి కథలు దొరికితే కచ్చితంగా చేస్తానని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement