Anchor Anasuya Comments On Sudigali Sudheer, Video Viral - Sakshi
Sakshi News home page

Anchor Anasuya: రెండు సినిమాలకే ఇంత ఓవర్‌ యాక్షన్‌ అవసరమా? ఫ్యాన్స్‌ ట్రోలింగ్‌

Dec 15 2022 3:55 PM | Updated on Dec 15 2022 4:20 PM

Anchor Anasuya Comments About Sudigali Sudheer Goes Viral In Social Media - Sakshi

బుల్లితెరపై యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ క్రేజ్‌ గురించిన తెలిసిందే. తనదైన యాంకరింగ్‌, అందం, గ్లామర్‌తో హీరోయన్లకు సమానమైన ఫ్యాన్‌ బేస్‌ను సంపాదించుకుంది. బుల్లితెరపై అలరిస్తూనే, వెండితెరపై కూడా సత్తా చాటుతుంది. ఇప్పటికే పలు చిత్రాల్లో లీడ్‌ రోల్‌ పోషిస్తూ నటిగా తనని తాను ప్రూవ్‌ చేసుకుంది. ప్రస్తుతం టీవీ షోలతో పోలిస్తే సినిమాలపై ఎక్కువగా ఫోకస్‌ పెట్టింది. వరుస మూవీ ఆఫర్లతో బిజీబిజీగా ఉంటోంది.

ఇదిలా ఉంటే తాజాగా ఓ కార్యక్రమంలో సుడిగాలి సుధీర్‌పై అనసూయ చేసిన కామెంట్స్‌ కాంట్రవర్సీకి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచాయి. ఇంతకీ ఏం జరిగిందంటే.. సుధీర్‌తో వర్క్‌ చేయడం ఎలా ఉంది? అని ఓ రిపోర్టర్‌ ప్రశ్నించగా.. అనసూయ కాస్త సీరియస్‌గానే ఆన్సర్‌ ఇచ్చింది. ''సుధీర్‌ నా జూనియర్‌. నేను సీనియర్‌ని అని మర్చిపోయారా? నాతో కలిసి పనిచేయడం ఎలా ఉందో సుధీర్‌ని అడగండి.

అతడు నా నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పాడు. నేను కూడా అతన్నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా'' అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడీ కామెంట్స్‌పై అనసూయను ట్రోల్‌ చేస్తున్నారు సుధీర్‌ ఫ్యాన్స్‌. 'రెండు, మూడు సినిమాలు చేసేసరికి ఇంత ఓవర్‌ యాక్షన్‌ అవరసరమా? సుధీర్‌ గురించి అడిగితే ఒక్క మాట చెప్పలేవా? అయినా స్టార్‌ హీరోలతో కూడా అనసూయతో పనిచేయడం ఎలా ఉంది అని వాళ్లనే అడగండి అని చెప్తావ్‌ కదా' అంటూ విమర్శిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement