TV Anchor Anasuya Bharadwaj Honored With Bahubali Khaja At Kakinada - Sakshi
Sakshi News home page

Anchor Anasuya : యాంకర్‌ అనసూయకు బాహుబలి కాజాతో సత్కారం

Published Sun, Jan 8 2023 10:23 AM

Anchor Anasuya Bharadwaj Honored With Bahubali Khaja At Kakinada - Sakshi

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): టీవీ యాంకర్, సినీనటి అనసూయ భరద్వాజ్‌కు శనివారం సురుచి పీఆర్వో వర్మ బాహుబలి కాజా అందించి సత్కరించారు. పెద్దాపురంలో షోరూమ్‌ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమెకు కాకినాడలోని ఒక హోటల్‌లో ఈ కాజా అందించినట్టు ఆయన వివరించారు. జిల్లాకు ప్రముఖులెవ్వరు వచ్చినా బాహుబలి కాజా అందివ్వడం సురుచి సంప్రదాయమన్నారు.

కాగా స్టార్‌ యాంకర్‌గా కొనసాగుతూనే సినిమాల్లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటుంది అనసూయ. రంగస్థలంతో  విమర్శకుల ప్రశంసలు పొందిన  ఈ బ్యూటీ ‘థ్యాంక్యూ బ్రదర్’, ‘ఖిలాడీ’, ‘పుష్ప’ సహా ఎన్నో చిత్రాల్లో నటించి సత్తాచాటింది. చివరగా దర్జా చిత్రంలో కనిపించింది. 

Advertisement
 
Advertisement
 
Advertisement