పిచ్చిగా నచ్చేశావే... | Anand Deverakonda Gam Gam Ganesha movie song release | Sakshi
Sakshi News home page

పిచ్చిగా నచ్చేశావే...

May 5 2024 1:30 AM | Updated on May 5 2024 1:40 AM

Anand Deverakonda Gam Gam Ganesha movie song release

నయన్‌ సారిక, ఆనంద్‌ దేవరకొండ

‘‘పిచ్చిగా నచ్చేశావే రంగు తూనీగా.. కళ్లలో చల్లేశావే రంగులన్నీ భలేగా..’ అంటూ సాగుతుంది ‘గం..గం..గణేశా..’ సినిమాలోని ‘పిచ్చిగా నచ్చేశావే’ పాట. ఆనంద్‌ దేవరకొండ హీరోగా, ప్రగతి శ్రీవాస్తవ, నయన్‌ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం ఇది. ఉదయ్‌ శెట్టి దర్శకత్వంలో కేదార్‌ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న రిలీజ్‌ కానుంది.

 శనివారం ఈ చిత్రంలోని ‘పిచ్చిగా నచ్చేశావే..’ పాట లిరికల్‌ వీడియోను హైదరాబాద్‌లోని మల్లారెడ్డి కాలేజీ విద్యార్థుల సమక్షంలో రిలీజ్‌ చేసింది యూనిట్‌. చేతన్  భరద్వాజ్‌ స్వరపరచిన ఈ పాటకు సురేష్‌ బనిశెట్టి సాహిత్యం అందించగా అనురాగ్‌ కులకర్ణి పాడారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement