తొలిసారి అలాంటి అనుభూతి దక్కింది : అమృత అయ్యర్   | Amritha Aiyer Talks About Hanu Man Movie | Sakshi
Sakshi News home page

‘హను-మాన్‌’కి వస్తున్న రెస్పాన్స్‌  చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి: అమృత అయ్యర్  

Jan 13 2024 2:52 PM | Updated on Jan 13 2024 3:14 PM

Amritha Aiyer Talk About Hanu Man Movie - Sakshi

‘‘హను–మాన్‌ సినిమా ప్రేక్షకులకు నచ్చాలనే లక్ష్యంతోనే యూనిట్‌ అంతా పని చేశాం. ఆడియన్స్‌తో కలిసి ఈ సినిమా చూశాను. వారి స్పందన చూస్తుంటే గూస్‌ బంప్స్‌ వచ్చాయి. నా కెరీర్‌లో తొలిసారి అలాంటి అనుభూతి దక్కింది’’ అని హీరోయిన్‌ అమృతా అయ్యర్‌ అన్నారు. తేజ సజ్జా, అమృతా అయ్యర్‌ జంటగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘హను–మాన్‌’. శ్రీమతి చైతన్య సమర్పణలో కె. నిరంజన్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం రిలీజైంది.

(చదవండి: ‘హను-మాన్‌’ మూవీ రివ్యూ)

ఈ సందర్భంగా అమృతా అయ్యర్‌ మాట్లాడుతూ– ‘‘ప్రశాంత్‌ వర్మగారు ‘హను–మాన్‌’ని అద్భుతంగా తీశారు. ఈ మూవీలో మీనాక్షి పాత్రని చక్కగా చేశావని ప్రేక్షకులు చెబుతుంటే హ్యాపీగా ఉంది. ఈ మూవీ జర్నీలో సహనంగా ఉండటం నేర్చుకున్నాను..  నటీనటులకు సహనం చాలా ముఖ్యం. ‘హను–మాన్‌ 2’ ఉంటుందని నాకూ తెలియదు. స్క్రీన్‌పై చూసి, సర్‌ప్రైజ్‌ అయ్యాను. ప్రస్తుతం తెలుగులో ‘అల్లరి’ నరేశ్‌కి జోడీగా ఓ సినిమా చేస్తున్నాను’’ అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement