జిమ్‌ వేర్‌లో అల్లు స్నేహ.. వర్కౌట్స్‌ వీడియో వైరల్‌ | Allu Sneha Reddy Gym Video Goes Viral | Sakshi
Sakshi News home page

జిమ్‌ వేర్‌లో అల్లు స్నేహ.. వర్కౌట్స్‌ వీడియో వైరల్‌

Mar 1 2024 10:29 AM | Updated on Mar 1 2024 10:50 AM

Allu Sneha Reddy Gym Video Viral - Sakshi

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సతీమణిగా స్నేహా రెడ్డి అందరికీ పరిచయమే.. కానీ సోషల్‌ మీడియాతో అందరికీ టచ్‌లో ఉంటూ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్‌ బేస్‌ను క్రియేట్‌ చేసుకున్నారు. తరచూ తన ఫొటోలు షేర్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటారు. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో నెటిజన్లను ఆకట్టుకుంటారు. ఈ క్రమంలో ఆమెకు నెట్టింట ఉండే ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు సుమారు 10 మిలియన్ల వరకు ఫాలోవర్స్‌ ఉన్నారు. సోషల్‌ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ తెచ్చుకున్న అల్లు స్నేహా ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అనే విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ఆమె తాజాగా ఒక వీడియోను షేర్‌ చేశారు. తన ఇంటి గార్డెన్‌లో ఉన్న గౌతమబుద్ధిడి విగ్రహం వద్ద జిమ్‌ వర్కౌట్స్‌ చేశారు.  వీలు చిక్కినప్పుడు తరచూ జిమ్‌, యోగ వీడియోలు, ఫొటోలను షేర్‌ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె విడుదల చేసిన ఈ వీడియో వైరల్‌ అవుతుంది. అక్కడ అల్లు అర్జున్‌ కూడా యోగా చేస్తారనే విషయం తెలిసిందే.. ఆమె పుట్టినరోజు నాడు కూడా జిమ్‌ వేర్‌లో ఉన్న స్నేహ వీడియోను బన్నీ షేర్‌ చేసి శుభాకాంక్షలు చెప్పారు. బాడీ ఫిట్‌నెస్‌ పట్ల వారిద్దరూ కూడా ఎంతో శ్రద్ధ పెడుతారనే విషయం తెలిసిందే. అల్లు స్నేహా సినిమాల్లో నటించక పోయినా హీరోయిన్లకే షాక్ ఇచ్చేలా ఫ్యాషన్ దుస్తులు ధరిస్తూ ట్రెండింగ్‌లో ఉంటారు.

SIT ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చైర్మన్, బిజినెస్ మెన్ సీ శేఖర్ రెడ్డి కూతురయిన స్నేహా రెడ్డి కామన్ ఫ్రెండ్ పెళ్లిలో  బన్నీతో పరిచయం ఏర్పడిటం.. ఆ తర్వాత 2011 మార్చి 6న వివాహం చేసుకోవడం జరిగింది. వీరికి కుమారుడు అల్లు అయాన్, కూతురు అల్లు అర్హ ఉన్న విషయం తెలిసిందే. పుష్ప-2 షూటింగ్‌ బిజీలో అల్లు అర్జున్‌ ఉన్నారు. ఈ ఏడాది ఆగష్టు 15న ప్రపంవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement