ప్రామిస్‌ని నిలబెట్టుకున్నాం: హీరో ప్రదీప్‌ | Akkada Ammayi Ikkada Abbayi success meet: Pradeep Machiraju Said That Thanks You To Audiences | Sakshi
Sakshi News home page

ప్రామిస్‌ని నిలబెట్టుకున్నాం: హీరో ప్రదీప్‌

Apr 13 2025 3:37 AM | Updated on Apr 13 2025 3:37 AM

Akkada Ammayi Ikkada Abbayi success meet: Pradeep Machiraju Said That Thanks You To Audiences

‘‘ఈ వేసవిలో మంచి తెలుగు సినిమా చూసి నవ్వుకుందాం అని భావించే ప్రతి ఫ్యామిలీని ‘మా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’కి ఆహ్వానిస్తున్నాం. మా సినిమా చూసి, థియేటర్స్‌ నుంచి బయటకొచ్చే ప్రతి ఒక్కరి ముఖంలో నవ్వు కనిపిస్తోంది. మా సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుల పెదవులపై నవ్వు ఉంటుందని ప్రామిస్‌ చేశాను.

ఆ ప్రామిస్‌ని నిలబెట్టుకున్నాం’’ అని ప్రదీప్‌ మాచిరాజు అన్నారు. ప్రదీప్‌ మాచిరాజు, దీపిక పిల్లి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. నితిన్‌–భరత్‌ దర్శకత్వంలో ఈ సినిమాను మాంక్స్‌ అండ్‌ మంకీస్‌ బ్యానర్‌ నిర్మించింది. ఈ చిత్రం ఈ నెల 11న విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో... ‘‘క్లీన్‌ కామెడీతో అందర్నీ నవ్విస్తామని చెప్పం. అదే చేశాం’’ అన్నారు నితిన్‌–భరత్‌. గెటప్‌ శ్రీను, మ్యూజిక్‌ డైరెక్టర్‌ రథన్, మైత్రి డిస్ట్రిబ్యూటర్‌ శశిధర్‌ రెడ్డి మాట్లాడారు.
 

Advertisement
 
Advertisement
Advertisement