అఖిల్‌ రిసెప్షన్‌లో సింపుల్‌గా మహేశ్‌.. ఆ టీ షర్ట్‌ ధర లక్షల్లో..! | Akhil Zainab Reception: Mahesh Babu T Shirt Cost Details | Sakshi
Sakshi News home page

అఖిల్‌ రిసెప్షన్‌: మహేశ్‌బాబు ధరించిన టీషర్ట్‌ ధర తెలిస్తే గుడ్లు తేలేయాల్సిందే!

Jun 9 2025 12:03 PM | Updated on Jun 9 2025 1:58 PM

Akhil Zainab Reception: Mahesh Babu T Shirt Cost Details

అందరికీ వయసు పెరుగుతుంది. కానీ టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు (Mahesh Babu)కు మాత్రం వయసు తగ్గిపోతూ వస్తుంది. అన్నం తింటాడా? అందం తింటాడా? అన్నంత హ్యాండ్‌సమ్‌గా కనిపిస్తుంటాడు. కుమారుడు గౌతమ్‌ పక్కన నిలబడితే అతడికి తండ్రిలా కాదు, అన్నలా ఉంటాడు. మహేశ్‌ అందం గురించి చెప్తే మాటలు సరిపోవు. అతడి ఫోటో కనిపిస్తే చాలు సోషల్‌ మీడియా షేకైపోతుంది.

సింపుల్‌గా టీ షర్ట్‌లో మహేశ్‌
తాజాగా మహేశ్‌.. అక్కినేని ఇంట శుభకార్యానికి హాజరయ్యాడు. నాగార్జున చిన్న కుమారుడు అఖిల్‌ అక్కినేని- జైనబ్‌ రవ్జీలు జూన్‌ 6న పెళ్లి చేసుకున్నారు. ఆదివారం (జూన్‌ 8న) అన్నపూర్ణ స్టూడియోలో వీరి రిసెప్షన్‌ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మహేశ్‌.. భార్య నమ్రత, కూతురు సితారను తీసుకుని హాజరయ్యాడు. అయితే మహేశ్‌.. సింపుల్‌గా టీ షర్ట్‌ వేసుకుని వెళ్లాడు. 

లక్ష పైచిలుకు..
చూడటానికి సింపుల్‌గా కనిపిస్తున్న ఈ టీ షర్ట్‌ ధర వేలల్లో కాదు లక్షల్లోనే ఉంది. ఫ్లవర్‌ ప్రింటింగ్‌ ఉన్న ఈ టీషర్ట్‌.. హెర్మ్స్‌ అనే లగ్జరీ బ్రాండ్‌కు చెందినది. దీని ధర దాదాపు రూ.1.37 లక్షలని తెలుస్తోంది. సినిమాల విషయానికి వస్తే మహేశ్‌ చివరగా గుంటూరు కారం అనే సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం రాజమౌళితో  #SSMB 29 చేస్తున్నాడు. ఇందులో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తోంది. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

చదవండి: అఖిల్‌ అక్కినేని రిసెప్షన్‌.. ఈ విషయం గమనించారా?

Advertisement
 
Advertisement
Advertisement