అజిత్ కుమార్‌ బర్త్ ‍డే.. భార్య షాలిని పోస్ట్ వైరల్! | Ajith Kumar Birthday Shalini shares old pics from birthday bash | Sakshi
Sakshi News home page

Ajith Kumar Birthday: అజిత్ కుమార్‌ బర్త్ ‍డే.. భార్య షాలిని పోస్ట్ వైరల్!

May 1 2025 3:42 PM | Updated on May 1 2025 4:14 PM

Ajith Kumar Birthday Shalini shares old pics from birthday bash

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇటీవలే పద్మభూషణ్ పురస్కారం అందుకున్న అజిత్ ఇవాళ తన 54వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన భార్య షాలిని బర్త్‌ డే వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

గతేడాది సెలబ్రేట్ చేసుకున్న బర్త్‌ డే వేడుక ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఇలాంటి రోజులు ఎప్పటికీ గుర్తుంటాయని క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు తమ హీరోకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ ఫోటోల్లో  అజిత్, షాలిని కుమార్తె అనౌష్క, కుమారుడు ఆద్విక్ థీమ్ కూడా ఉన్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ ఈ ఏడాది తమిళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. అంతకుముందు విదాముయార్చి మూవీతో ప్రేక్షకులను అలరించాడు. పద్మభూషణ్ అవార్డ్ అందుకున్న అజిత్‌కు చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో స్వల్ప గాయాలయ్యాయి. పెద్ద సంఖ్యలో అభిమానులు రావడంతో ఆయన కాలికి గాయమైంది. వెంటనే ఆస్పత్రిలో చేరిన అజిత్‌.. చికిత్స అనంతరం ఇంటికి వెళ్లారు.
 

 

Advertisement
 
Advertisement
Advertisement