నాదేం లేదు.. దీనంతటికీ కారణం నా భార్య: స్టార్ హీరో | Ajith Credits Wife Shalini For His Success, Says She Made So Many Sacrifices | Sakshi
Sakshi News home page

Ajith Shalini: పద్మ భూషణ్ అవార్డ్.. భార్యకు క్రెడిట్ ఇచ్చిన హీరో

Apr 30 2025 9:00 AM | Updated on Apr 30 2025 11:30 AM

Ajith Credits Wife Shalini For His Success

తమిళ హీరోల్లో అజిత్ కాస్త డిఫరెంట్. సినిమాలు చేసి ప్రేక్షకుల్ని అలరించడం తప్పితే మిగతా విషయాల్లో పెద్దగా తలదూర్చడు. తన పనేదో తాను అన్నట్లు ఉంటాడు. కారే రేసింగ్ లో ఈ మధ్య కాలంలో రఫ్ఫాడిస్తున్నాడనే చెప్పాలి. ఈసారి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పద్మభూషణ్ ఇతడిని వరించింది. తాజాగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా అజిత్ ఈ పురస్కారం అందుకున్నాడు.

(ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్ 

ఈ క్రమంలోనే కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్లిన అజిత్.. పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు. అయితే తను ఇలా ఉండటానికి భార్యనే కారణం అని చెబుతూ మొత్తం క్రెడిట్ ఆమెకే ఇచ్చేశాడు. తాజాగా ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు.

'ఇప్పటికీ సామాన్యుడిలానే ఆలోచిస్తాను. ఇంత ఎత్తు ఎదిగానా అని ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంటుంది. దీనంతటికీ నా భార్య షాలినినే కారణం. ఎందుకంటే నా కోసం చాలా త్యాగాలు చేసింది. ప్రతిదానిలో నాకు తోడుంది. ఒక్కోసారి కరెక్ట్ నిర్ణయాలు తీసుకోలేకపోయాను. ఆ టైంలోనూ షాలిని నాకు అండగా నిలిచింది తప్పితే నిరుత్సాహపరచలేదు'

(ఇదీ చదవండి: ‍థియేటర్, ఓటీటీలో బ్లాక్ బస్టర్.. ఇప్పుడు సీక్వెల్!)

'నా జీవితంలో సాధించిన సక్సెస్ క్రెడిట్ అంతా షాలినికే ఇస్తాను. నటిగా ఎంతో గుర్తింపు ఉన్నప్పటికీ నాకోసం అన్నింటినీ వదులుకుంది. ఆమెకు చాలామంది అభిమానులున్నారు. వాళ్లకు నా థ్యాంక్స్. నేను కేవలం యాక్టర్ నే. సూపర్ స్టార్ అని పిలిపించుకోవడం నచ్చదు. అలాంటి ట్యాగ్స్ పై నాకు నమ్మకం లేదు' అని అజిత్ చెప్పుకొచ్చాడు.

తమిళ హీరోగా ‍అజిత్ చాలా ఫేమస్. హీరోయిన్ గా కలిసి పనిచేసిన షాలిని.. 2000లో ఇతడిని పెళ్లిచేసుకుంది. అప్పటినుంచి సినిమాలు, నటనకు దూరమైంది. ఈ జంటకు కొడుకు-కూతురు ఉన్నారు.

(ఇదీ చదవండి: ‍అల్లు అర్జున్ కోసం ఫ్లాపుల హీరోయిన్?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement