ఫైనల్‌గా తండ్రి దర్శకత్వంలో కూతురు? | Aditi New Movie With Father And Director Shankar | Sakshi
Sakshi News home page

Aditi Shankar: బంపరాఫర్ కొట్టేసిన అదితీ.. నెక్స్ట్ మూవీలో?

Jul 29 2024 11:50 AM | Updated on Jul 29 2024 11:50 AM

Aditi New Movie With Father And Director Shankar

కోలీవుడ్‌లో స్టార్‌ దర్శకుల లిస్ట్ తీస్తే అందులో ముందుండే పేరు శంకర్. భారీ సినిమాలని తీసి రికార్డులు కొల్లగొట్టే ఈయన.. రీసెంట్ గా వచ్చిన 'భారతీయుడు 2'తో ఘోరమైన డిజాస్టర్ అయింది. దీంతో శంకర్‌ తీసిన 'గేమ్‌ ఛేంజర్‌'పై లేనిపోని సందేహాలు వస్తున్నాయి. రామ్‌ చరణ్‌ హీరోగా నటించిన ఈ సినిమా.. క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి రానుంది. దీని పోస్ట్ ప్రొడక్షన్ చేస్తూనే.. 'భారతీయుడు 3'పైన శంకర్ ఫోకస్ పెట్టాడు. మరికొన్ని సీన్స్ తీసే ప్రయత్నాల్లో ఉన్నాడట.

(ఇదీ చదవండి: హీరోయిన్‌తో పెళ్లి రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన మెగాహీరో)

వీటన్నింటి తర్వాత శంకర్ ఏం సినిమా చేస్తాడా అనేదే సస్పెన్స్‪‌గానే ఉంది. 'వేలప్పారి' నవలను భారీ బడ్జెట్‌తో శంకర్ తీయాలనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులోనే తన కూతురిని కూడా నటింపజేసే ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతం తమిళంలో యంగ్ హీరోల సినిమాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకునే పనిలో ఉన్న అదితీకి.. తండ్రి శంకర్ దర్శకత్వంలో నటించే ఛాన్స్ వస్తే జాక్‌పాట్ కొట్టేసినట్లే!

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 20 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement