Viral Video: Actress Adah Sharma Does BackFlips In Saree | చీరకట్టులో ఆదాశర్మ విన్యాసాలు - Sakshi
Sakshi News home page

చీరకట్టులో అదాశర్మ విన్యాసాలు.. వీడియో వైరల్‌

Jan 12 2021 4:34 PM | Updated on Jan 12 2021 7:04 PM

Adah Sharma Does Cartwheels On Beach In A Saree - Sakshi

అదా శర్మ.. పూరీ జగన్నాథ్ హార్ట్‌ ఎటాక్‌ సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచమైన హీరోయిన్‌. ఆ మూవీ తర్వాత ఈ బ్యూటీకి ఎక్కువ సినిమా అవకాశాలు రాలేదు. మధ్య మధ్య చిన్న చిన్న సినిమాలు చేసినా.. అంతగా గుర్తింపు రాలేదు. అయితే ఆమె సినిమాల ద్వారా ప్రత్యేకమైన పేరు రాకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్ గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. ఎప్పుడు ఇన్‌స్ట్రాగ్రామ్‌లో యాక్టీవ్ గా ఉంటూ వింత వింత విన్యాసాలు చేస్తూ ఎల్లప్పుడూ వార్తల్లో నిలుస్తుంది.

తన హాట్‌ హాట్‌ ఫోటోలను సోషల్‌ మీడియాలో పెట్టి కుర్రకారుల మతులు పోగొడుతోంది. తాజాగా ఈ భామ చీర కట్టులో పల్టీలు కొడుతూ దర్శనం ఇచ్చింది. సముద్రతీరాన చీరకట్టులో ఆమె చేసిన విన్యాసాలను చూపిస్తూ ఓ వీడియో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. అదా శర్మ విన్యాసాలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అదా శర్మ చివరిసారిగా సౌల్సతి అనే షార్ట్ ఫిల్మ్‌లో కనిపించింది. అంతకు ముందు పాటి పత్ని అనే వెబ్‌ సిరీస్‌లో నటించింది. 

Advertisement
 
Advertisement
Advertisement