ముఖానికి సర్జరీ చేసుకుని షాకిచ్చిన యువ నటి.. ఫొటో వైరల్ | Actress Trinetra Haldar Undergoes Facial Feminization Surgery | Sakshi
Sakshi News home page

Trinetra Haldar: ఓటీటీ నటిగా గుర్తింపు.. ఇప్పుడేమో షాకింగ్ నిర్ణయం

May 11 2024 6:48 PM | Updated on May 11 2024 7:11 PM

Actress Trinetra Haldar Undergoes Facial Feminization Surgery

సినిమా నటులు సర్జరీ చేసుకోవడం అనేది ఇండస్ట్రీలో అప్పుడప్పుడు వినిపించే మాట. చాలామంది హీరోహీరోయిన్లు అందంగా కనిపించేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వీళ్ల గురించి అప్పుడప్పుడు వార్తలు వస్తుంటాయి తప్పితే వాళ్లంతట వాళ్లుగా మాత్రం చెప్పరు. కానీ టాన్స్‌జెండర్ నటి మాత్రం ఇప్పుడు తన ముఖానికి సర్జరీ చేసుకున్నానని చెప్పి షాకిచ్చింది.

త్రినేత్ర హల్దర్ గుమ్మరాజు.. తెలుగు/బెంగాలీకి చెందిన కుటుంబంలో బెంగళూరులో పుట్టింది. దాదాపు 20 ఏళ్ల వరకు అబ్బాయిలానే జీవించింది. అయితే ఎంబీబీఎస్ చేస్తున్న సమయంలో తనలో అమ్మాయి లక్షణాలు ఉన్నాయని గ్రహించిన త్రినేత్ర.. 2018లో ట్రాన్స్ జెండర్‌గా మారింది. పేరుని త్రినేత్రగా మార్చుకుంది. తర్వాత ఏడాది థాయ్‌లాండ్ వెళ్లి ఆపరేషన్ చేయించుకుంది. అయితే ఈమెకు కుటుంబ పూర్తిగా అండగా నిలిచింది.

(ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్‌కి హైకోర్టు నుంచి నోటీసులు.. కారణం ఏంటంటే?)

దీంతో ఓ వైపు కోర్సు పూర్తి చేసి డాక్టర్ అయింది. మరోవైపు తనలాంటి ట్రాన్స్‌జెండర్స్‌కి అవగాహన కల్పించడం కోసం యూట్యబర్‌గా మారింది. అలా కంటెంట్ క్రియేటర్‌గా కాస్త గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది ఓటీటీలో రిలీజైన 'మేడ్ ఇన్ హెవెన్ 2' వెబ్ సిరీస్‌తో నటిగా మారింది. 'రెయిన్ బో రిస్తా' అనే మరో సిరీస్‌లో కూడా నటించింది.

అయితే టాన్స్‌జెండర్‌గా మారినప్పటికీ ఇంకా మనసులో ఎక్కడో వెలితిగా ఉంది. దీంతో ఇప్పుడు అమ్మాయిలా కనిపించేందుకు ముఖానికి.. ఏప్రిల్ 8న సర్జరీ చేసుకున్నట్లు త్రినేత్ర చెప్పుకొచ్చింది. ఈ విషయాన్నే ఇన్ స్టాలో పోస్ట్‌గా పెట్టింది. ఈ క్రమంలోనే ఈమెని మెచ్చుకుంటూ పలువురు కామెంట్స్ పెడుతున్నారు.

(ఇదీ చదవండి: రీల్ విలన్‌తో టాలీవుడ్ హీరోయిన్ రిలేషన్.. ఇక మిగిలింది పెళ్లే?

Advertisement
 
Advertisement
Advertisement