Actress Raashi Khanna reveals her weight loss secret! - Sakshi
Sakshi News home page

Raashi Khanna: లవర్ గురించి సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్

Aug 1 2023 5:21 PM | Updated on Aug 1 2023 6:28 PM

Actress Raashi Khanna Boyfriend Weight Loss Secret - Sakshi

ఏంటి.. హీరోయిన్ రాశీఖన్నా లవ్‌లో పడిందా? అవును ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే చెప్పింది. 'ఊహలు గుసగుసలాడే' మూవీతో హీరోయిన్‌గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. సినిమా సినిమాకు తనని మార్చుకుంది. ప్రారంభంలో బొద్దుగా ఉండేది కానీ తర్వాత స్లిమ్‌గా తయారై సెగలు పుట్టిస్తోంది. చాలామంది ఈమె సింగిల్ గానే ఉందనుకుంటున్నారు. కానీ తనకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పుకొచ్చింది.  

బ్రేకప్‌తో బరువు పెరిగా
'అప్పట్లో నేను ఓ వ్యక్తితో డేటింగ్‌లో ఉన్నాను. అతడితో బ్రేకప్ అవ్వడం వల్ల డిప్రెషన్‌కి గురయ్యాను. దీనికి తోడు నాకు థైరాయిడ్ సమస్య ఉండటంతో విపరీతంగా బరువు పెరిగిపోయాను. చాలా ప్రయత్నించా, ఎన్నో వర్కౌట్స్ చేశా కానీ బరువు తగ్గలేదు. జిమ్ కోచ్‌ని మార్చినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇలా బరువు పెరగడంతో నేను చేస్తున్న సినిమాలపై ఎఫెక్ట్ పడింది'

(ఇదీ చదవండి: దేవుడి సినిమాకు 'A' సర్టిఫికెట్.. మరో కాంట్రవర్సీ?)

డేటింగ్‌తో స్లిమ్‌గా
'మీరే చెప్పండి హీరోయిన్ బరువు పెరిగితే అవకాశాలు ఎలా వస్తాయి? అయితే ఫైనల్‌గా నన్ను అర్థం చేసుకునే ఓ వ్యక్తి దొరికాడు. అతడితో డేటింగ్ మొదలుపెట్టిన తర్వాత అదేంటో గానీ బరువు తగ్గాను. స్లిమ్ అయ్యాను. చెప్పాలంటే నేను అనుకున్నట్లు మారాను.' అని హీరోయిన్ రాశీఖన్నా చెప్పుకొచ్చింది. అయితే ఇక్కడ ఓ వ్యక్తి అని చెప్పింది కానీ అతడు ఎవరో? ఏంటి? అనే విషయాలు మాత్రం బయటపెట్టలేదు. త్వరలో చెబుతుందేమో? 

ఆ మూవీస్‌తో బిజీ
రాశీఖన్నా నటించిన తెలుగు సినిమాలు 'పక్కా కమర్షియల్', 'థాంక్యూ' గతేడాది విడుదలయ్యాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర అవి ఫెయిలయ్యాయి. ప్రస్తుతానికి తెలుగులో కొత్త చిత్రాలేం చేయడం లేదు. తమిళంలో రెండులో, హిందీలో 'యోధ' చిత్రం చేస్తోంది. ఈ ఏడాది 'ఫర్జీ' వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్రేక్షకుల్ని కూడా అలరించింది. ఇది పక్కనబెడితే అప్పుడప్పుడు పెళ్లి గురించి కామెంట్స్ చేస్తూ ఉంటుంది. త్వరలో పెళ్లి ఏమైనా ప్లాన్ చేస్తుందోమో చూడాలి.

(ఇదీ చదవండి: వరుణ్-లావణ్య పెళ్లి.. అలాంటి పద్ధతిలో?)

Advertisement
 
Advertisement
Advertisement