పెళ్లయినా తగ్గని ‘చందమామ’ క్రేజ్‌.. ఇన్‌స్టాలో 20 మిలియన్ల ఫాలోవర్స్‌ | Actress Kajal Aggarwal Got 20 Million Followers on Instagram | Sakshi
Sakshi News home page

Kajal Aggarwal: పెళ్లయినా తగ్గని కాజల్‌ క్రేజ్‌.. పెరిగిన ఇన్‌స్టా ఫాలోవర్స్‌

Oct 24 2021 3:01 PM | Updated on Oct 24 2021 3:29 PM

Actress Kajal Aggarwal Got 20 Million Followers on Instagram - Sakshi

టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న నటి కాజల్‌ అగర్వాల్‌. ‘లక్ష్మీ కల్యాణం’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన ఈ బ్యూటీ.. రెండో సినిమా ‘మగధీర’తో టాప్‌ హీరోయిన్ల..

టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న నటి కాజల్‌ అగర్వాల్‌. ‘లక్ష్మీ కల్యాణం’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన ఈ బ్యూటీ.. రామ్‌ చరణ్‌ హీరోగా చేసిన ‘మగధీర’తో టాప్‌ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయింది. అందచందాలతో అభిమానుల మనసులు దోచిన ఈ తార.. వరుసగా స్టార్‌ హీరోలతో సినిమాలు చేస్తూ తన క్రేజ్‌ మరింతగా పెంచుకుంటూ పోయింది ఈ భామ. అంతేకాకుండా కొన్ని మూవీస్‌తో బాలీవుడ్‌ ప్రేక్షకులని సైతం పలకరించింది ఈ బ్యూటీ.

అయితే కాజల్‌ ఇటీవల స్నేహితుడు గౌతమ్ కిచ్లును వివాహమాడిన విషయం తెలిసిందే. పెళ్లాయిన తర్వాత కొంతమంది హీరోయిన్ల క్రేజ్‌ పడిపోవడం సాధారణంగా జరుగుతుంటుంది. కానీ ఈ చందమామది ఏ మాత్రం తగ్గలేదని.. ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌ని పెంచుకోవడం చూ​స్తుంటే అర్థం అవుతోంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటూ.. తన ఖాతాలో 20 మిలియన్ల (2కోట్లు)కు ఫాలోవర్స్ వేసుకుంది. తన జోరు ఇలాగే కొనసాగితే సోషల్‌ మీడియా ఫాలోవర్స్‌ ఇంకా పెరిగే అవకాశం లేకపోలేదు.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన ‘ఆచార్య’ సినిమాలో నటిస్తోంది కాజల్‌. ఇప్పటికే ఈ సినిమాలో తన పాత్ర వరకు షూటింగ్‌ను పూర్తి చేసిన ఈ బ్యూటీకి  చిరుతో రెండో మూవీ. కాగా ఇటీవల సినిమాలను తగ్గించేసింది ఈ భామ. దానికి కారణం తను గర్భవతి కావడమేనని ఫిల్మీ దునియాలో ప్రచారం జరుగుతోంది.

చదవండి: హబ్బీతో హాలిడే ట్రిప్‌, స్టన్నింగ్‌ ఫోటోలు

Advertisement
 
Advertisement
Advertisement