అలా ఎవరైనా అంటే అస్సలు తట్టుకోలేను: హీరోయిన్ ఇలియానా | Actress Ileana Comments On Her Husband Michael | Sakshi
Sakshi News home page

భర్త గురించి ఇలియానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. తట్టుకోలేనంటూ!

Mar 17 2024 6:58 PM | Updated on Mar 18 2024 10:02 AM

Actress Ileana Comments On Her Husband Michael - Sakshi

చేసినవి తక్కువే సినిమాలే అయినా టాలీవుడ్ గుర్తుండిపోయే హీరోయిన్లలో ఒకరైన ఇలియానా.. ప్రస్తుతం అమ్మతనాన్ని ఆస్వాదిస్తోంది. బిడ్డ ఆలనాపాలనా చూసుకుంటోంది. అయితే పెళ్లి చేసుకోకుండానే తల్లయిన ఇలియానాపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. అలానే కుటుంంబం, భర్తపై కూడా పలువురు నెటిజన్స్ ట్రోల్స్ చేశారు. ఇప్పుడు దీనిపై స్వయంగా ఇలియానానే స్పందించింది. అలా మాట్లాడితే తట్టుకోలేనని ఆవేదన వ్యక్తం చేసింది.

(ఇదీ చదవండి: నడుము అందాలతో అనుపమ.. కేతికని ఇలా చూస్తే అంతే!)

'గర్భవతి అయిన తర్వాత కూడా పనిచేయాలనుకున్నా. కానీ పరిస్థితులు సహకరించకపోవడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాను. అప్పుడు అమ్మ అండగా నిలిచింది. బిడ్డ పుట్టిన తర్వాత ఒత్తిడికి లోనయ్యాను. అప్పుడు నా భాగస్వామి మైకేల్ సపోర్ట్ చేశాడు. మా బంధం గురించి బహిరంగంగా చెప్పాలని లేదు. అలానే చేసి గతంలో విమర్శలు ఎదుర్కొన్నాను. నా గురించి ఏమన్నా తట్టుకోగలిగాను. కానీ నా భాగస్వామి(భర్త), కుటుంబం గురించి తప్పుగా మాట్లాడితే తట్టుకోలేను' అని ఇలియానా చెప్పుకొచ్చింది.

2018లో చివరగా తెలుగులో 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమాలో కనిపించిన ఇలియానా.. ఆ తర్వాత హిందీకే పరిమితమైంది. రీసెంట్‌గా మార్చి 8న ఈమె నటించిన 'తేరే క్యా హోగా లవ్ లీ' చిత్రం రిలీజైంది. ఇది కాకుండా ఈ బ్యూటీ చేతిలో ఇంకో హిందీ మూవీ ఉంది. 

(ఇదీ చదవండి: కాస్ట్‌లీ నెక్లెస్‌తో సెన్సేషనల్ హీరోయిన్.. రేటు ఎంతో తెలుసా?)

Advertisement
 
Advertisement
Advertisement