Actress Anikha Surendran Glamorous Treat For Movie Chances, Photos Goes Viral On Internet - Sakshi
Sakshi News home page

Anikha Surendran Latest Photos: ఛాన్సుల కోసం మాస్టర్ ప్లాన్.. రెచ్చగొట్టేలా!

Jul 26 2023 9:27 AM | Updated on Jul 26 2023 4:40 PM

Actress Anikha Surendran Glamorous Treat For Chance - Sakshi

ప్రస్తుతం దేనికైనా పబ్లిసిటీ చాలా ముఖ్యం. సినిమా రంగంలోని వారికి ఇది బాగా తెలుసు. అందుకే స్టార్‌ హీరో హీరోయిన్ల నుంచి అప్‌‌కమింగ్‌ యాక్టర్స్ వరకు దీనికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. హీరోయిన్లు అయితే తమ గ్లామరస్‌ ఫొటోలని ట్విట్టర్‌, ఇన్‌‌స్టాలో పోస్ట్‌ చేస్తూ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ యువ హీరోయిన్ అనిక సురేంద్రన్‌ ఈ విషయంలో హద్దులు దాటేస్తుందనే చెప్పాలి. 

(ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ జరిగిందా?)

2010లోనే బాలనటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనిక.. మాతృభాష మలయాళంతో పాటు తెలుగు, తమిళంలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. తమిళంలో అజిత్‌ 'విశ్వాసం' సినిమాలో బాలనటిగా తెగ ఫేమస్ అయిపోయింది. అలాంటిది ఈ మధ్యే హీరోయిన్‌గా మారింది. తెలుగులో 'బుట్టబొమ్మ' చిత్రంలో కథానాయకిగా చేసింది. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో అనికకు గుర్తింపు రాలేదు. 

ఈ క్రమంలోనే పబ్లిసిటీపై దృష్టి పెట్టిన ఈ చిన్నది.. సోషల్ మీడియాని తెగ వాడే‍స్తోంది. శృతి మించిన అందాలని చూపిస్తూ దర్శక నిర్మాతల దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తోంది. అయినా ఫలితం దక్కట్లేదు. తమిళంలో హీరోయిన్‌గా ఇంకా బోణీ కొట్టలేదు. మలయాళంలో 'ఓ మై డార్లింగ్‌' చిత్రంలో నటించింది. ఇందులో లిప్‌లాక్‌ సీన్‌లో నటించి షాకిచ్చింది. కథ డిమాండ్‌ మేరకే అలా యాక్ట్ చేశానని సమర్థించుకుంటోంది.

(ఇదీ చదవండి: ఉపాసన డైమండ్ గిఫ్ట్‌పై తమన్నా క్లారిటీ!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement